Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో తప్పకుండ పోటీచేస్తానన్న డీఎల్ రవీంద్రారెడ్డి…

వచ్చే ఎన్నికల్లో తప్పకుండ పోటీచేస్తానన్న డీఎల్ రవీంద్రారెడ్డి…
-వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన డీఎల్
-2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధం
-ఏపీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి
-వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది
-కాకపోతే ఏ పార్టీనుంచి చేస్తారనే క్లారిటీ లేదు

2024 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు.కాకపోతే ఏ పార్టీనుంచి చేస్తారనే క్లారిటీ లేదు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు.

తన పొలాన్ని కౌలుకు ఇద్దామనుకుంటే… తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు. రాష్ట్ర మంత్రులెవరూ వారి శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం లేదని విమర్శించారు. సొంత ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల అక్రమాలను ప్రజలు నిలదీయాలని అన్నారు.

జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయనపై కడప ఎంపీ అభ్యర్థిగా డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆ ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు డీఎల్ ఆసక్తి చూపగా…ఆ స్థానంలో సుధాకర్ యాదవ్ ను చంద్రబాబు బరిలోకి దింపారు.

అనంతరం 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ ను ఆయన కలిశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న డీ ఎల్ తన వైఖరిని స్పష్టం చేయడంతో రాజకీయవర్గాల్లో ఆశక్తి కార చర్చ జరుగుతుంది.

Related posts

గాంధీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా?: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్!

Drukpadam

రామచంద్రాపురం వార్: వైసీపీ హైకమాండ్‌కు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అల్టిమేటం

Ram Narayana

జబ్బార్ స్టేట్మెంట్లో లాజిక్ మిస్…

Drukpadam

Leave a Comment