Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా!

ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా!
-టీడీపీ తమను ఎంతో గౌరవించిందన్న కుతూహలమ్మ
-అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన
-వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టీకరణ

ఏపీలో టీడీపీకి షాక్ లమీద షాక్ లు తగులుతున్నాయి. నిన్న మొన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఖాళీ అవుతుందని ఏపీ నుంచి లోకసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో గల్లా జయదేవ్ , కేశినేని నాని లు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇవి అన్ని వట్టి పుకార్లేనని టీడీపీ కొట్టి పారేస్తున్న సందర్భంలో ఆ పార్టీకి చెందిన కుతూహలమ్మ టీడీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరబోవటం లేదని ఆమె ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. తాను నియోజకవర్గంలో పర్యటించలేక పోతున్నానని తనకు ఆరోగ్యం కూడా సహకరించడంలేదని ఆమె అంటున్నారు. అయితే ఆమె కుమారుడు హరికృష్ణ కూడా టీడీపీ కి రాజీనామా చేయడం అనుమానాలకు తావు ఇస్తున్నది .

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కుమారుడు, టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ బాధ్యుడు హరికృష్ణ కూడా పార్టీకి, నియోజకవర్గ బాధ్యుడి పదవికి రాజీనామా చేశారు.

తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. టీడీపీ తమను ఎంతగానో గౌరవించిందన్నారు. అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.

వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో తొలిసారి వేపంజేరి (జీడీ నెల్లూరు) నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1989, 1999, 2004లో విజయం సాధించారు.

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కుతూహలమ్మ పనిచేశారు. 2007లో ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి కాంగ్రెస్ తరపున జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Related posts

ఎమ్మెల్సీ ల ఎన్నికల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన టీఆర్ యస్ …బలహీనవర్గాల పెదవి విరుపు!

Drukpadam

రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్ ప్రదేశ్ లో వంద ఇళ్లతో చైనా గ్రామం.. 

Drukpadam

సొంత శాటిలైట్‌ను పేల్చివేసిన ర‌ష్యా.. అమెరికా తీవ్ర ఆగ్రహం!

Drukpadam

Leave a Comment