Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల సంయమనం పాటించండి: డీజీపీ గౌతమ్ సవాంగ్!

రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల సంయమనం పాటించండి: డీజీపీ గౌతమ్ సవాంగ్!
రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు
టీడీపీ, వైసీపీ మధ్య భగ్గుమన్న రాజకీయాలు
ప్రకటన జారీ చేసిన డీజీపీ కార్యాలయం
చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరిక
దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్న డీజీపీ

పట్టాభి మాటలు వైసీపీ దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు . టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను, సజ్జల రామకృష్ణ రెడ్డి , రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై విరుచుకు పడ్డారు. విధానపరమైన విమర్శలు ప్రతిపక్షాలు చేయాల్సిందే కానీ అవి శృతిమించాయి. వ్యక్తిగా దూషణలుగా మారాయి. దీంతో ఈ ప్రెస్ మీట్ చుసిన వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలపైనా దాడులు చేశాయి. మాటలు గాని, దాడులుగాని సమర్థనీయం కాదు . ఇది ఇరుపార్టీల నేతలు ఆలోచించుకోవాలి . అధికారంలో ఉన్నవారు మరింత భాద్యతగా ఉండాలి .అది లోపించింది. దీంతో పరిపాలన కట్టు తప్పిందని విమర్శలకు తావిచ్చింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ రెచ్చెగొట్టే మాటలు దాడులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజా పరిణామాల నేపథ్యంలో స్పందించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశానికి గురికాకుండా సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించరాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొనసాగించడంలో ప్రజలు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

Related posts

Smartphone Separation Anxiety: Scientists Explain Why You Feel Bad

Drukpadam

మూడు రాజధానులపై విచారణ ముందుగా చేపట్టలేము …సుప్రీం …!

Drukpadam


వేషం మార్చినంత మాత్రాన ఈటల ఉత్తముడు కాలేడు: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment