Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హుజూరాబాద్ లో దళితబంధును అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్!

 

హుజూరాబాద్ లో దళితబంధును అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్!

  • పిటిషన్ వేసిన సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య
  • కొనసాగుతున్న పథకాన్ని ఆపేయడం సరికాదన్న పిటిషనర్
  • ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో ఈసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈసీ తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదని తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాన్ని ఆపేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇతర పథకాలను ఆపకుండా… కేవలం దళితబంధును మాత్రమే ఆపాలని ఆదేశించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. ఈసీ ఉత్తర్వులు ఎస్సీ, ఎస్టీ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని… అందువల్ల ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.

 

Related posts

ఆగస్టు 14న ‘విభజన భయానక జ్ఞాపక దినం’ గా జరుపుకోవాలి: ఎర్రకోటపై నుంచి మోదీ!

Drukpadam

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం

Drukpadam

ఏడాదిలోగా అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం: లోక్ సభలో నితిన్ గడ్కరీ ప్రకటన

Drukpadam

Leave a Comment