Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఐపీఎల్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు… 

ఐపీఎల్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు… 

  • కొత్త జట్లకు ఇటీవల బిడ్లు ఆహ్వానించిన బీసీసీఐ
  • అహ్మదాబాద్ జట్టును సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్స్
  • లక్నో జట్టును చేజిక్కించుకున్న ఆర్పీజీ గ్రూప్
  • వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు

ఐపీఎల్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు…

ఐపీఎల్ అంటే ఇండియా లో పిచ్చి క్రేజీ ఉంది. … అందువల్ల దీనిపై వ్యాపార దిగ్గజాలు మక్కువ చూపుతున్నాయి. ఇప్పటికే 8 జట్లు ఐపీఎల్ లో ఆడుతుండగా వాటికీ తోడు మరో రెండు జట్లు వచ్చే సీజన్ నుంచి ఆడనున్నాయి. దీంతో ఐపీఎల్ లో అదే జట్ల సంఖ్య 10 కి పెరగనుంది. అన్ని జట్ల ను వ్యాపారాదిగ్గజాలే దక్కించుకున్నాయి. ఇండియా లో యువ ఆటగాళ్లకే కాకా వివిధ దేశాలనుంచి అనేక మంది ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీ లలో చేరతారు .అందువల్ల సీనియర్ లు జూనియర్లతో కలిసి ఉండటం తో ఆటకూడా రంజుగా ఉంటుంది.

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త జట్లు రంగప్రవేశం చేశాయి. వచ్చే సీజన్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పాల్గొంటాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు కొత్త జట్ల కోసం ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్ లో… అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకుంది. లక్నో జట్టును ఆర్పీజీ గ్రూప్ చేజిక్కించుకుంది.

లక్నో ఫ్రాంచైజీ కోసం ఆర్పీజీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.7 వేల కోట్లకు బిడ్ వేశారు. అటు, అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ సంస్థ రూ.5 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల చేరికతో ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి పెరిగింది. వచ్చే సీజన్ నుంచే ఈ రెండు జట్లు తమ ప్రస్థానం ఆరంభించనున్నాయి.

Related posts

కోహ్లీ ఇంత బేలగా మాట్లాడతాడని అనుకోలేదు: కపిల్ దేవ్!

Drukpadam

‘హరికేన్ బెరిల్’ ఎఫెక్ట్‌తో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా.. రంగంలోకి బీసీసీఐ!

Ram Narayana

సూర్య సూపర్ సెంచరీ… జొహాన్నెస్ బర్గ్ లో సిక్సర్ల వాన

Ram Narayana

Leave a Comment