Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు.. నలుగురి పేర్లను పేర్కొన్న సీబీఐ!

వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు.. నలుగురి పేర్లను పేర్కొన్న సీబీఐ!
-పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
-గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్, దస్తగిరిలపై అభియోగాలను మోపిన సీబీఐ
-వీరిని ఆగస్ట్, సెప్టెంబర్ లో అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న విచారణ సంస్థ

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వివేకా మృతికి నలుగురు వ్యక్తులు కారణమని ఛార్జ్ షీటులో పేర్కొంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, డ్రైవర్ దస్తగిరిలు హత్య చేసినట్టు అభియోగాలు మోపింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీరిని అరెస్ట్ చేశామని తెలిపింది. నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని.. వీరిలో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొంది. ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైల్లో ఉన్నారని తెలిపింది.

ఈ కేసులో పెద్ద తలలు ఉన్నాయని , రాజకీయనేతల ప్రమేయం ఉండనే అనుమానాలు బలంగా వినిపించాయి. వైయస్ వివేకానంద హత్య విషయంలో అంతకు ముందు ఉన్న చంద్రబాబు సర్కారు గాని ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లు ఎత్తాయి. జగన్ టార్గెట్ చేస్తూ టీడీపీ ,టీడీపీ ని టార్గెట్ చేస్తూ వైసీపీ లు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.సుదీర్ఘకాలం విచారణ జరిపిన సిబిఐ చివరకు నలుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చుతూ కడప కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు ముగింపు దశకు చేరుకుందా ? లేదా ? అనే విషయంలో సిబిఐ స్పష్టత ఇవ్వలేదు . రాష్ట్రంలో అట్టుడికిన వివేకా హత్య తనకు దగ్గరగా ఉండేవాళ్ళే చేశారనే నిర్ధారణకు సిబిఐ వచ్చింది. అనేక మందిని విచారణ జరిపింది. ఒక హత్య కేసును ఇంతకాలం విచారం జరపటం అరుదుగా జరిగే సంఘటనగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

నేను సైతం అంటూ అస్సాల్ట్ రైఫిల్ అందుకున్న మాజీ మిస్ ఉక్రెయిన్

Drukpadam

గుజరాత్ లో నింగి నుంచి నేల రాలిన లోహపు బంతులు.. పరీక్షల కోసం ఇస్రోకు తరలింపు!

Drukpadam

ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా… సెంట్రల్ విస్టా పూర్తికి డెడ్ లైన్ విధించిన కేంద్రం!

Drukpadam

Leave a Comment