Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

టీవీ డిబేట్ లో పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ కు అవమానం ….

టీవీ డిబేట్ లో పాక్ మాజీ క్రికెటర్ అక్తర్ కు అవమానం ….
టీవీ డిబేట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశం
అవమాన భారంతో న్యూస్ డిబేట్ లైవ్ లోనుంచి వెళ్లిపోయిన అక్తర్..
పాక్, న్యూజిలాండ్ మ్యాచ్ పై ఇటీవల చర్చ
తాను అడిగిన విషయాలకే సమాధానం చెప్పాలన్న టీవీ యాంకర్
తనకు ఇష్టం వచ్చిన అంశంపై మాట్లాడిన అక్తర్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇటీవల ఓ న్యూస్ డిబేట్ లో పాల్గొనగా ఆయనకు అవమానం జరిగింది. దీంతో లైవ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 26న పాక్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పాక్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో పీటీవీ ఓ లైవ్ డిబేట్ నిర్వహించి దానిపై ప్రముఖుల అభిప్రాయాలు అడుగుతోంది.

ఈ డిబేట్ లో అక్తర్ తో పాటు సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావేద్ పాల్గొన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్ బౌలర్లు హరీస్ రవూఫ్, షహీన్ ఆఫ్రిది ఆటతీరును అక్తర్ ప్రశంసించాడు. అయితే, మధ్యలో టీవీ యాంకర్ నౌమన్ నియాజ్ కలుగజేసుకుని తాను డిబేట్ లో అడిగిన అంశాలకు సమాధానం చెప్పాలని, ఇతర అంశాలను ప్రస్తావించకూడదని చెప్పాడు.

ఆ యాంకర్ మాటలను అక్తర్ పట్టించుకోలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ వెళ్లాడు. దీంతో యాంకర్ కు కోపం వచ్చేసింది. ఆ డిబేట్ నుంచి అక్తర్ వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు. అక్తర్ ఆ అవమానంతో డిబేట్ నుంచి వెళ్లిపోయాడు. అక్తర్ ను ఆ టీవీ యాంకర్ వెళ్లిపోవాలని చెప్పడం పట్ల విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ టీవీ చానెల్ తాజాగా వివరణ ఇచ్చింది. అక్తర్, నౌమన్ కు మధ్య జరిగిన గొడవపై విచారణకు ఆదేశించామని, ఈ విచారణ పూర్తయ్యే వరకు టీవీ చానెల్ లోకి వారిరువురినీ అనుమతించబోమని చెప్పింది.

టీవీ చానెల్ చేసిన ప్రకటనపై అక్తర్ మండిపడ్డాడు. ఆ చానెల్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని చెప్పాడు. డిబేట్ లోనుంచే తానే ప్రేక్షకులందరి ముందు బయటకు వచ్చేశానని చెప్పాడు. ఆ టీవీ చానెల్ తనను బహిష్కరించడం ఏంటని ప్రశ్నించాడు. తనను టీవీ కార్యక్రమాల నుంచి బహిష్కరించడానికి వారు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Related posts

చెత్త ఆటతో వెస్ట్ ఇండీస్ తో టి 20 సీరీస్ కోల్పోయిన ఇండియా ..

Ram Narayana

ఇండోర్ టెస్టులో ఘోర పరాజయానికి రోహిత్ శర్మ చెప్పిన కారణాలు ఇవే!

Drukpadam

ఎదురులేని రాజస్థాన్ రాయల్స్… ముంబయికు తీవ్ర నిరాశ!

Drukpadam

Leave a Comment