తెలంగాణలో పలు చోట్ల భూప్రకంపనలు
–తెలంగాణలో తరచుగా ప్రకంపనలు
–ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కంపించిన భూమి
–నేడు జగిత్యాల, రామగుండం ప్రాంతాల్లో ప్రకంపనలు
–ప్రజల్లో ఆందోళన
తెలంగాణలో ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు రావడం తెలిసిందే. నేడు మరోసారి భూమి కంపించింది. ఈసారి జగిత్యాల, రామగుండం ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. సాయంత్రం 6.49 గంటలకు భూమి 3 సెకన్ల పాటు కంపించింది. భూప్రకంపనలతో జగిత్యాల, రామగుండం ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.
భూకంప తీవ్రత ఎంత అనేది ప్రకటించినప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. 3 సెకన్లు మాత్రమే భూమి కంపించినప్పటికీ ఇళ్లలో ఉన్న తేలికపాటి సమన్లు కిందపడ్డాయి. ఒక్కసారిగా భూమి కాళ్ళ కింద కదలడంతో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు పరుగులు తీశారు. సాయంత్రం 6 . 49 గంటలకు వచ్చిన ఈ భూకంపం జగిత్యాల , రామగుండము ప్రాంతాలలో భూమి కంపించడంతో అక్కడ ప్రజలు ఉలిక్కి పడ్డారు. అనేక గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దీనిపైనే చేర్చించుకుంటున్నారు. పెద్దగా నష్టం ఏమి జరగలేదని ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి భూకంపాలు వస్తూనే ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.