హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు: ఏడో రౌండ్‌లోనూ ఈటలదే హవా!
- రౌండు రౌండుకీ కొనసాగుతున్న ఈటల ఆధిక్యం
- ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,432 ఓట్ల ఆధిక్యం
- ఏడో రౌండ్‌లో బీజేపీకి 4,038, టీఆర్ఎస్‌కు 3,792 ఓట్లు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఏడో రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యత కనబర్చారు. ఏడో రౌండ్‌లో ఆయన 246 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తం ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,432 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏడో రౌండ్‌లో బీజేపీకి 4,038, టీఆర్ఎస్‌కు 3,792, కాంగ్రెస్‌కు 94 ఓట్లు దక్కాయి. ఏడు రౌండ్ల తర్వాత బీజేపీకి 31,021, టీఆర్ఎస్‌కు 27,589 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,086 ఓట్లు దక్కాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలం వీణవంకలో కూడా బీజేపీదే ఆధిక్యం!
- హుజూరాబాద్ మండలంలో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించిన బీజేపీ
- వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఏడో రౌండ్ లో కూడా ఈటలదే ఆధిక్యత
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు రౌండ్ల లెక్కింపు జరగ్గా… అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించారు. తొలి ఆరు రౌండ్లు హుజూరాబాద్ మండలానికి సంబంధించినవి కావడం గమనార్హం. హుజూరాబాద్ మండలానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మండలంలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది.
ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలమైన వీణవంక మండలంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఏడో రౌండ్ లో కూడా బీజేపీనే ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.