Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హుజూరాబాద్ లో తొలిసారి టీఆర్ఎస్ కు లీడ్.. ఎంతంటే..

  • ఎనిమిదో రౌండ్ లో 162 ఓట్ల మెజారిటీ
  • గెల్లు శ్రీనివాస్ కు 4,248 ఓట్లు
  • ఈటల రాజేందర్ కు 4,086
TRS Gets Lead For the First Time

హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొలిసారి టీఆర్ఎస్ లీడ్ లోకి వచ్చింది. ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 162 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయనకు ఈ రౌండ్ లో 4,248 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,086 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఈటల రాజేందర్ 3,270 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. ఈటలకు ఎనిమిది రౌండ్లు కలిపి 35,107 ఓట్లు పోలవగా.. గెల్లుకు 31,837 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు కేవలం 1,175 ఓట్లే వచ్చాయి.

అయితే, ఎనిమిదో రౌండ్ లో గెల్లు సొంతూరు హిమ్మత్ నగర్ కూడా ఉండడమూ కలిసి వచ్చిందని చెబుతున్నా.. గెల్లుకు సొంతూరులోనే తక్కువ ఓట్లు పోలయ్యాయి. హిమ్మత్ నగర్ లో బీజేపీకి 540కిపైగా ఓట్లు వస్తే.. గెల్లుకు 300 ప్లస్ ఓట్లు వచ్చాయి. మరోవైపు మరో 15 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పేలా లేదు. కాగా, కౌంటింగ్ సిబ్బంది మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. దీంతో 9వ రౌండ్ ఫలితాలు కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయి.

Related posts

యుద్ధ విమానం కూలిపోతే ఇంట కథ ఉందా?

Drukpadam

డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశిస్తే.. 20 వేల జరిమానా!

Drukpadam

How To Update Your Skincare Routine For Autumn

Drukpadam

Leave a Comment