మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చేవారు కచ్చితంగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని… నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే వారిని కర్ణాటకలోని అనుమతిస్తామని తెలిపింది. టెస్టు రిపోర్టు కూడా 72 గంటల్లోపు వచ్చినది అయ్యుండాలని చెప్పింది.
‘మహారాష్ట్ర నుంచి వచ్చేవారంతా… హోటళ్లు, హాస్టళ్లు, రిసార్టులు, డార్మెటరీలు లేదా ఇళ్లకు వచ్చేవారంగా తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని 72 గంటలు దాటని ఆర్టీ-పీఆర్సీ రిపోర్టును అందజేయాలి. టెస్ట్ రిపోర్టు లేకపోతే వారిని రాష్ట్రంలోకి అనుమతించము’ అని ప్రకటనలో తెలిపింది. అంతేకాదు గత రెండు వారాల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. ఎంఎన్సీలు, హోటళ్లు, రిసార్టులు, లాడ్జిల్లో పని చేస్తున్న మహారాష్ట్ర వాసులందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.