Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశ ప్రజలకు దీపావళి కానుక.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం!

దేశ ప్రజలకు దీపావళి కానుక.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం!
-నానాటికీ పెరుగుతున్న పెట్రోలియం ధరలతో బెంబేలెత్తుతున్న జనాలు
-దీపావళి సందర్భంగా సుంకాన్ని తగ్గించిన కేంద్రం
-పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గింపు

ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించిన కేంద్రం పరుగులు పెడుతున్న పెట్రోలియం ధరలను తగ్గించింది. ఉప ఎన్నికల్లో బీజేపీ కి పెద్ద ఎదురు దెబ్బె తగిలింది. అనుకున్న విధంగా బీజేపీ కి సీట్లు రాలేదు . ఫలితంగా కేంద్రం దిగిరాకతప్పలేదు . కేంద్రం సుంకాన్ని తగ్గించడం ప్రజలకు ఊరట నిచ్చే అంశం . దీపావళి కానుకగా ప్రజలకు కేంద్రం సుంకం ను పెట్రోల్ పై ఐదు రూపాయలు , డీజిల్ పై 10 రూపాయలు తగ్గించింది.

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి వీపు విమానం మోత మోగుతోంది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసరాలన్నింటిపై పడుతోంది. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా జనాలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలను తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

 

Related posts

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్… కొట్టివేసిన సుప్రీంకోర్టు…

Drukpadam

కేసీఆర్ సారు జర్నలిస్టుల గోడు వినండి మీరు ….

Drukpadam

ధాన్యం ఇతరదేశాల నేరుగా ఎగుమతి చేయాలి …ఏపీ సీఎం జగన్

Drukpadam

Leave a Comment