Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఛత్తీస్ ఘడ్ సీఎం కు కొరడా దెబ్బలు …

ఛత్తీస్ గఢ్ సీఎం  కు కొరడా దెబ్బలు …
ఛత్తీస్ గఢ్ లో వింత ఆచారం… కొరడా దెబ్బలు కొట్టించుకున్న ముఖ్యమంత్రి!
దీపావళి తర్వాత గోవర్ధన పూజ
పూజలో భాగంగా కొరడా దెబ్బలు
కొరడాతో కొట్టించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మిక
గతేడాది కూడా పూజలో పాల్గొన్న సీఎం భగేల్

 

ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్న నిజం …కానీ ఇక్కడ ఉన్న ఆచారం మేరకు గోవర్ధన పూజలో ఈ వింత ఆచారంలో అనేకమంది ప్రముఖులు పాల్గొంటారు. కొరడా దెబ్బలు తింటారు. తాము చేసిన పాపపరిహారం ఈ దెబ్బలతో పోతుందని అక్కడివారు నమ్మకం

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వింత ఆచారం ఉంది.అక్కడ దీపావళి మరుసటి రోజు దుర్గ్ జిల్లాలో జజన్ గిరి అనే గ్రామంలో గోవర్ధన పూజ జరిగింది . అక్కడ పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తినడం ఆనవాయితీగా ఉంటుంది. దీనికోసం భక్తులు క్యూకడతారు . ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కూడా హాజరయ్యారు అక్కడ పూజకు హాజరైయ్యారు. కొరడా దెబ్బలతో ఉన్న దోషాలు తొలిగిపోయి మంచి జరుగుతుందని ఎవరి నమ్మకం . అందుకు సీఎం కూడా అందరిలాగా ఆ పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తిన్నాడు.

ప్రతి ఏడాది దీపావళి తర్వాత ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గోవులకు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. దుర్గ్ జిల్లాలోని జజన్ గిరి అనే గ్రామంలో గోవర్ధన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తినడం ఎప్పటినుంచో వస్తోంది. నేడు జజన్ గిరి గ్రామంలో ఈ పూజ నిర్వహించగా, సీఎం భూపేశ్ భగేల్ కూడా హాజరయ్యారు. గోవర్ధన పూజలో పాల్గొన్న ఆయన ఆ వింత ఆచారాన్ని పాటించారు. కొరడాతో 8 పర్యాయాలు కొట్టించుకున్నారు.

ఆయన గతేడాది కూడా ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేశారు. కొరడా దెబ్బలు తింటే దైవ కృప లభిస్తుందన్నది అక్కడి వారి నమ్మకం. తాను కూడా ఈ వింత ఆచారాన్ని నమ్ముతానని సీఎం భగేల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరి కొరడా దెబ్బలు తిన్నానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Related posts

దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ!

Drukpadam

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన శిశువు..

Drukpadam

రాష్ట్రపతి పర్యటన  ట్రాఫిక్ నిలిపివేత.. మహిళా పారిశ్రామికవేత్త మృతి

Drukpadam

Leave a Comment