Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి సర్జరీ.. ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గాయం?

జూనియర్‌ ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి సర్జరీ.. ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గాయం?
-నాలుగు రోజుల క్రితమే మైనర్ సర్జరీ
-కొన్ని రోజుల పాటు జాగ్ర‌త్త‌లు
-నిన్నటి ఫొటోలోనూ చేతికి బ్యాండేజీ

టాలీవుడ్ అగ్రశ్రేణి హీరో లలో ఒకరైన జానియర్ ఎన్టీఆర్ జిమ్ లో వ్యాయాయం చేస్తుండగా చేతివ్రేలుకు చిన్నపాటి గాయమైంది. దీంతో ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు.ఇప్పుడు ఆయన బాగానే ఉన్నా కొన్ని రోజులు గాయం నయం అయ్యేందుకు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు. అత్యంత బిజీ గా ఉన్నా ఎన్టీఆర్ తప్పని పరిస్థిల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు . ఆయన పిల్లలతో దీపావళి కి కలిసి ఉన్న ఫోటో ను పోస్ట్ చేశారు. అందులోను ఆయన చేతి వ్రేలుకు జరిగిన సర్జరీ కనిపిస్తుంది. ఇటీవలనే కర్ణాటకు చెందిన పునీత్ రాజ్ కుమార్ హఠాన్ మరణం చెందటం తో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. జిమ్ లో ఎక్కువ వర్క్ అవుట్ చేసినందునే ఆయన మరణించారని అందువల్ల యంగ్ సినీ యాక్టర్లు జిమ్ లో వర్క్ అవుట్ చేయడం కొంత తగ్గించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో జూనియర్ సర్జరీ చిన్నదే అయినప్పటికీ చర్చనీయాంశంగా మారింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతి వేలుకి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల క్రితమే ఆయ‌న మైనర్ సర్జరీ చేయించుకున్నార‌ని సమాచారం. కొన్ని రోజుల పాటు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌కు వైద్యులు సూచించారు. నిన్న ఎన్టీఆర్ త‌న కుమారుల‌తో కలిసి దిగిన ఫొటోలోనూ కుడి చేతికి బ్యాండేజీతో కనిపించాడు.

ఇక, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు రెడీ అవుతోంది. త్వరలో కొరటాల శివ దర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాలోనూ న‌టించాల్సి ఉంది. మరోపక్క, ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో కూడా చేస్తున్నాడు.అయితే ఆయన కార్యక్రమాలకు పెద్ద ఇబ్బంది లేదని సమాచారం .

Related posts

‘ది కశ్మీర్ ఫైల్స్’రికార్డులే రికార్డులు..14 రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూలు!

Drukpadam

సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవికి కాంగ్రెస్ నేతల వార్నింగ్…

Drukpadam

అడకత్తెరలో పోకచెక్కలాగా తెలుగు సినీ నిర్మాతల మండలి!

Drukpadam

Leave a Comment