Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామాలు…

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామాలు…
-ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడే తొలగింపు
-నన్నెవరూ తొలగించలేదు… నేనే పిటిషన్ వేశాను: సమీర్ వాంఖడే
-ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
-ప్రత్యేక బృందానికి విచారణ బాధ్యతలు
-ఎన్సీబీ రీజనల్ డైరెక్టర్ గా కొనసాగనున్న వాంఖడే
-ఇది ఆరంభం మాత్రమేనన్న మంత్రి నవాబ్ మాలిక్

దేశంలో తీవ్ర చర్చకు దారితీసిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తొలగించారు. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్ వాంఖడేపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కేసు విచారణ జరుపుతున్న వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు.

వాంఖడేను తప్పించిన నేపథ్యంలో ఇకపై ఎన్సీబీకి చెందిన ప్రత్యేక బృందం ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో సంబంధం ఉన్న 5 కేసుల విచారణ కొనసాగించనుంది. ఈ మేరకు ఎన్సీబీ స్పెషల్ టీమ్ కు అధికారాలు బదలాయించారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే ఎప్పట్లాగానే ఎన్సీబీ ముంబయి విభాగానికి జోనల్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.

దీనిపై మంత్రి నవాబ్ మాలిక్ స్పందిస్తూ, ఇది ఆరంభం మాత్రమేనని, 26 కేసుల్లో నిగ్గుతేలాల్సి ఉందని అన్నారు. ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు సమీర్ వాంఖడే నుంచి రూ.25 కోట్లకు డిమాండ్ వచ్చిందని ప్రభాకర్ వెల్లడించాడు. ఈ మేరకు ప్రభాకర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.

నన్నెవరూ తొలగించలేదు… నేనే పిటిషన్ వేశాను: సమీర్ వాంఖడే

ఆర్యన్ ఖాన్ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సమీర్ వాంఖడే స్పందించారు. తనను ఎవరూ ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈ కేసు విచారణ జరిపించాలని కోరుతూ తానే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశానని సమీర్ వాంఖడే వెల్లడించారు. ఇకపై ఈ కేసును ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.

Related posts

పంజాబ్ సర్కార్ ను అప్రమత్తం చేసిన కేంద్రం!

Drukpadam

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం!

Drukpadam

లిక్కర్ స్కాం లో మరోసారి కవిత పేరు తెరపైకి ….!

Drukpadam

Leave a Comment