Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అవకాశం ఇస్తే పోటికి సిద్ధం:కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం: శ్రీనివాస్ యాదవ్ మేళం
పార్టీకి తక్కువమంది స్థానిక ప్రతినిధులు ఉన్నా పోటీ చేయాల్సిందే !
అందరి ఆశ్సీసులు తనకున్నాయన్న మేళం
తనకు అవకాశం ఇవ్వకపోయినా కొత్తవారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి
నాయకత్వ అందుకు చొరవ చూపాలి

కాంగ్రెస్ పార్టీకి కనీస సంఖ్యాబలం లేదు… పోటీకి ఎవరు ముందుకు రారు అనుకున్న తరణంలో… పార్టీ ఉనికి ప్రధానం …గెలుపోటములు సహజం …అవకాశం ఇస్తే ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని మధిర కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ వాది మేళం శ్రీనివాస్ యాదవ్ ముందుకు వచ్చారు. ఈ మేరకు పీసీసీ కి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీనివాస్ యాదవ్ మేళం ఒక ప్రకటనలో తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యుడైన మేళం శ్రీనివాసయాదవ్ మధిర నియోజకవర్గానికి చెందినవారు . కాంగ్రెస్ పార్టీ లో యాక్టీవ్ కార్యకర్తగా ఉన్నారు . గతంలో భట్టికి అంత్యంత సన్నిహితుడిగా ఉన్న మేళం ఆయన తో విభేదించి రేణుక చౌదరి శిబిరంలో చేరారు. స్థానికంగా అనేక సేవాకార్యక్రమాలు చేస్తుందనే పేరుంది.

ప్రజా ప్రతినిధులు అయిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన వారు తక్కువమంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. మొన్న జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడైన శ్రీ బల్మూర్ వెంకట్ అతి తక్కువ ఓట్లు వచ్చిన బాధ పడాల్సిన అవసరం లేదని పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడమే ముఖ్యం అని అన్నారు .

గత ఎన్నికల సమయంలో లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన  నాగ బండి రాంబాబు  గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు చేసిన శ్రీ పువ్వాడ నాగేశ్వరావు  ఓటమి చెందిన మన ఓటు మనమే ఎంచుకో గలిగాం పేర్కొన్నారు.

గెలుపోటములు శాశ్వతం కాదని బడుగు బలహీన వర్గాలకు ఈ జిల్లాలో అవకాశం తప్పనిసరిగా ఉండాలని తను పోటి చేయడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలసి టిక్కెట్ కోరినట్లుగా తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయకులైన రేణుకా చౌదరి, భట్టివిక్రమార్క, సంభాని చంద్రశేఖర్, మరియు పోడెం వీరయ్య ల ఆశీస్సులు తనకు ఉన్నాయని ఓడిపోయే సీటు కూడా ప్రాధాన్యత పెరిగే విధంగా తాను ప్రయత్నం చేస్తా గెలుపుకు దగ్గరగా పని చేస్తానని తెలియజేశారు

జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ తనకు అవకాశం ఇవ్వకపోయినా పార్టీ పోటీపెట్టే అభ్యర్థికి తన మద్దతు ఉంటుందని ,పోటీచేయించి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని అన్నారు.నాయకత్వం అందుకు చొరవ తీసుకోవాల్సి ఉందని అన్నారు.

Related posts

కొడవళ్ళతో దోస్తీ… గులాబీ లో కలవరం ….

Drukpadam

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం

Drukpadam

కశ్మీర్ పై ఏకపక్ష చర్యలను ఆమోదించం: చైనా

Drukpadam

Leave a Comment