Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏమిటీ సూప్?’ అంటూ రెస్టారెంట్‌ మేనేజ‌ర్ ముఖంపై వేడివేడి సూప్ పోసిన క‌స్ట‌మ‌ర్.. 

ఏమిటీ సూప్?’ అంటూ రెస్టారెంట్‌ మేనేజ‌ర్ ముఖంపై వేడివేడి సూప్ పోసిన క‌స్ట‌మ‌ర్.. 
-సూప్ న‌చ్చ‌లేద‌ని క‌స్ట‌మ‌ర్ మండిపాటు
-మేనేజ‌ర్‌ను నిల‌దీసిన క‌స్ట‌మ‌ర్
-సూప్ పోసి పారిపోయిన వైనం
-అమెరికాలోని టెక్సాస్‌లో ఘ‌ట‌న‌

అమెరికా అగ్రదేశం …అందువల్ల అక్కడ ఏది జరిగిన ప్రపంచ వింతగానే ఉంటుంది. హైక్లాస్ హోటల్స్ …అందుకు తగ్గట్లుగా పరిశుభ్రత ఉంటుందని అందరు భావిస్తారు . నిజంగానే అక్కడ పరిశుభ్రత విషయంలో రాజీపడరు .కానీ ఒక రెస్త్రరెంట్ లో ఒక కస్టమర్ తాను ఇచ్చిన ఆర్దర్స్లో ప్లాస్టిక్ కాగితాలు రావడ గుర్తించి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. హోటల్ మేనేజర్ ముఖం పై వేడి వేడి సూప్ విసిరి కొట్టి అక్కడ నుంచి జారుకున్నారు

రెస్టారెంటుకు వ‌చ్చి సూప్ ఆర్డ‌ర్ చేసింది ఓ మ‌హిళ‌. అయితే, అది బాగోలేద‌ని, స‌ర్వీస్ చేసేది ఇలాగేనా? అంటూ వేడివేడి సూప్‌ను రెస్టారెంటు మేనేజ‌ర్‌పై పోసేసి, వెళ్లిపోయింది. చివ‌ర‌కు ఆ క‌స్ట‌మ‌ర్ కారు నంబ‌రును గుర్తించిన మేనేజ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచారణ జ‌రుపుతున్నారు. మేనేజ‌ర్ పై క‌స్ట‌మ‌ర్ సూప్ పోసిన‌ దృశ్యాలు రెస్టారెంటులోని సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల రెస్టారెంటుకు వ‌చ్చిన ఓ కస్టమర్‌ స్పైసీ మెక్సికన్‌ సూప్‌ ఆర్డర్ చేయ‌గా, ఆమెకు రెస్టారెంటు సిబ్బంది సర్వ్‌ చేసిన సూప్‌ కంటైనర్‌లో ప్లాస్టిక్‌ ముక్కలు కనపడ్డాయి. దీంతో క‌స్ట‌మ‌ర్ కోపంతో ఊగిపోయింది. ఆ సూప్ ప‌ట్టుకుని రెస్టారెంట్‌ మేనేజర్‌ జన్నెల్లే బ్రోలాండ్‌ వద్దకు వెళ్లి నిల‌దీసింది.

ఆ వెంట‌నే వేడివేడి సూప్‌ను మేనేజర్ ముఖంపై పోసింది. అనంత‌రం అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. వేడివేడి సూప్ ముఖంపై ప‌డ‌డంతో రెస్టారెంట్ మేనేజ‌ర్ షాక్ కు గుర‌యింది. అనంత‌రం క‌స్ట‌మ‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి మేనేజ‌ర్ బ్రోలాండ్ ప్ర‌య‌త్నించింది.

రెస్టారెంటు వ‌ద్ద ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆ క‌స్ట‌మ‌ర్ కారు ఫోటోలు తీయించింది. అనంత‌రం ఆ ఫొటోల ఆధారంగా టెక్సాస్‌ పోలీసులకు మేనేజ‌ర్ ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆ మేనేజ‌ర్ మీడియాకు వివ‌రించి చెప్పింది. సూప్ న‌చ్చ‌క‌పోతే ఫిర్యాదు చేయ‌కుండా క‌స్ట‌మ‌ర్ చేసిన పని సరైంది కాదని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

 

Related posts

సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో రక్తసిక్తం

Drukpadam

ఆసుపత్రి నెంబర్ అని ఫోన్ చేస్తే రూ.99 వేలు పోయాయి!

Drukpadam

రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు…హోమ్ మంత్రిని సైతం అడ్డుకున్న వైనం!

Drukpadam

Leave a Comment