Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

బిగ్ బాస్ ఒక కన్నేశాడు …మాస్క్ పెట్టుకోవడం మరవద్దు హైద్రాబాద్ మెట్రో…

బిగ్ బాస్ ఒక కన్నేశాడు …మాస్క్ పెట్టుకోవడం మరవద్దు హైద్రాబాద్ మెట్రో…
-మాస్క్ పై హైద్రాబాద్ మెట్రో వినూత్న ప్రచారం …బిగ్ బాస్ మిమ్ములను గమనిస్తున్నాడు!
-మెట్రోలో మాస్క్ తీసి మాట్లాడుతున్నారా?..మీరు బుక్ అయినట్లే
-స్టార్ మాతో జత కట్టిన ఎల్‌అండ్‌టీ
-‘బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు’ అంటూ ప్రచారం
-కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహనే లక్ష్యం

బిగ్ బాస్ షో లో హోస్ట్ నాగార్జున శని ,ఆదివారాలలో దర్శనమిచ్చి మీ ఇంటితో పాటు,మా ఇంటిపైన ఒక కన్నేసి ఉంచండి అంటూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం బై బై అంటూ శలవు తీసుకోవడం పాపులర్ అయింది. దీంతో హైద్రాబాద్ మెట్రో కూడా ప్రయాణికులను కరోనా మహమ్మారినుంచి అప్రమత్తంగా ఉండేందుకు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇది ప్రయాణికులను బాగా ఆకట్టుకోనున్నది .

హైదరాబాద్ మెట్రో రైలులో మాస్క్ తీసి మాట్లాడేవారిపై ‘బిగ్‌బాస్’ ఓ కన్నేసి ఉంచిన విషయాన్ని మర్చిపోవద్దంటూ మెట్రో అధికారులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు స్టార్ మాతో కలిసి ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిన్న అన్నపూర్ణ స్టూడియోస్‌లోని బిగ్‌బాస్ సెట్‌లో ‘బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు.

బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జున, ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రయాణికుల భద్రతపై మరింత అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని నాగార్జున తెలిపారు. కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, మొబైల్ క్యూఆర్ కోడ్ టికెట్లు, స్మార్ట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంపొందించడమే ఈ ప్రచారం లక్ష్యమని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.

Related posts

తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత…

Drukpadam

కరోనా వృద్ధిని అడ్డుకునేందుకు 2డీజీ ఔషధం విడుదల చేసిన కేంద్రమంత్రులు….

Drukpadam

కరోనా మల్లి డేంజర్ బెల్స్ …తస్మాత్ జాగ్రత్త :ప్రపంచ ఆరోగ్య సంస్థ…

Drukpadam

Leave a Comment