Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘కాట్సా’ చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా!

కాట్సా’ చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా!
-2019లో రష్యాతో భారత్ ఒప్పందం
-ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు
-భారత్ ను హెచ్చరించిన అప్పటి అధ్యక్షుడు ట్రంప్
-కాట్సా పరిధిలోకి భారత్

అమెరికా భారత్ కు మిత్ర దేశమే కానీ తన శత్రుదేశాల నుంచి మిత్రదేశాలకు ఎలాంటి సహాయం పొందరాదని రూల్ పెట్టింది. అగ్రరాజ్యం … దాన్ని అతిక్రమించిన మిత్రదేశాలపై ‘కాట్సా’ చట్టం పెట్టింది.రష్యా నుంచి భారత్ 2019లో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేయడం భారత్ చేసిన నేరం … దీనివల్ల భారత్ పై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్ తో ఎప్పటినుంచో రష్యా కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. దీంతో వివిధ సందర్భాలలో భారత్ రష్యా నుంచి సహాయం పొందుతుంది. రష్యా ,అమెరికాకు శత్రు దేశం అయినందున ట్రంప్ భారత్ పై ‘కాట్సా’ చట్టం పెట్టారు . దానినుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్ ప్రభుత్వం పెట్టుకున్న అభ్యర్థనను అమెరికా తిరస్కరించింది.

అగ్రరాజ్యం అమెరికా తన విధానాలకు వ్యతిరేకంగా ఉండే దేశాలతో మిత్రదేశాలు ఎలాంటి లావాదేవీలు జరుపరాదంటూ ఓ చట్టం కూడా తీసుకువచ్చింది. దాని పేరు ‘కాట్సా’. ‘కాట్సా’ అంటే ‘కౌంటరింగ్ అమెరికాస్ యాడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్’ అని అర్ధం. తన మాట వినకుండా తన శత్రుదేశాలతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా ఈ కాట్సా చట్టం పేరుతో ఆంక్షలు విధిస్తుంది. ఇప్పుడు భారత్ అగ్రరాజ్యం అమెరికాకు మిత్రదేశమే అయినా కాట్సాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రష్యా నుంచి భారత్ 2019లో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసింది. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా కొత్త ప్రభుత్వం స్పందిస్తూ, భారత్ కు కాట్సా నుంచి మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పూర్తిగా, పాక్షికంగా ఎవరికీ మినహాయింపు కల్పించే వెసులుబాటు కాట్సా చట్టంలో లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఇది భారత్ కు కూడా వర్తిస్తుందని వివరించాయి.

2014లో రష్యా బలగాలు క్రిమియాపై దురాక్రమణకు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా… రష్యాకు దూరంగా ఉండాలంటూ తన మిత్రదేశాలకు స్పష్టం చేసింది.

Related posts

ఇంటర్ బోర్డు ముందు జగ్గారెడ్డి దీక్ష…

Drukpadam

సిమెంట్ రేటు తగ్గించరు కానీ, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తారట!: చంద్రబాబు వ్యంగ్యం!

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

Drukpadam

Leave a Comment