Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫీజు రియంబర్స్మెంట్ ,ఉపకార వేతనాల కోసం ఖమ్మం కలెక్టరేట్ ముంట్టడించిన ఏ ఐ ఎస్ ఎఫ్!

ఫీజు రియంబర్స్మెంట్ ,ఉపకార వేతనాల కోసం ఖమ్మం కలెక్టరేట్ ముంట్టడించిన ఏ ఐ ఎస్ ఎఫ్!
-విద్యార్థుల జీవితాలను రాజకీయాలకు ప్రాణంగా పెడతారా ?
-మూడేళ్ల గా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ పై చిత్తశుద్ధి ఏదీ ?
-ఉప ఎన్నికలకు. ఇచ్చిన ప్రాధాన్యత ఉపకారవేతనాలు ఇవ్వరా ?
-3800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
-కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా

ఫీజు రియంబర్స్ మెంట్ ,ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ…
మాటల గారడి ప్రభుత్వానికి గోరి కడతామని హెచ్చరించారు. . పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ని చెల్లించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3800 కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని , వాటిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి విద్యార్థులకు పెద్ద పీఠం వేస్తామని హామీ ఇచ్చిందని కానీ ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది నీరుగారి పోయిందని దుయ్యబట్టారు . .

రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులను ఆయా కళాశాలల్లో ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని , ఈ నేపథ్యంలో విద్యార్థులు కళాశాలల మానివేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు . పెండింగ్లో ఉన్నవి ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ కోసం 15లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని . కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారని అన్నారు . ఎన్నికల సందర్భంగా పథకాలు , ఎన్నికల ఖర్చులకు , బతకమ్మ లకు పుష్కరాల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని ధ్వజమెత్తారు . తక్షణమే ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని అన్నారు . లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు .

Related posts

వరుడి ముక్కు చిన్నగా ఉందని అమ్మలక్కల గుసగుసలు …పెళ్లి రద్దు చేసుకున్న వధువు ..

Drukpadam

ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు …?

Drukpadam

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోల మృతి!

Drukpadam

Leave a Comment