ఖమ్మం మహిళకు అరుదైన గౌరవం
ఖమ్మం కు చెందిన మహమ్మద్ ఫర్హా అహ్మదాబాద్ లో జరిగిన VPR MRS.India సీజన్ 2 పోటీలో మొదటి రన్నర్ అప్ గా మరియు Mrs. India ఫొటోజెనిక్ గా ఎన్నికైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రిజిష్టర్ చేసుకున్న 912 వివాహిత మహిళలను ఆడిషన్ చేయగా 41 మంది ఫైనల్ కు అర్హత సాధించారు. ఇందులో మన తెలంగాణ రాష్ట్రం నుండి తను ఓక్కరే ఎంపికవ్వగా, ఈ నెల 21 న జరిగిన ఫైనల్ ఈవెంట్ లో ఫర్హా మొదటి రన్నర్ అప్ గా నిలిచింది. మిస్ ఇండియా పోటీల్లా కాకుండా పూర్తిగా సంప్రదాయబద్దంగా ఈ ఈవెంట్ వుంటుందని ఫర్హా అన్నారు. వివిధ assignments , టాలెంట్ రౌండ్, ట్రెడిషనల్ రౌండ్ , ఫైనల్ రౌండ్ల లో ఈ ఈవెంట్ జరిగిందన్నారు. ఫైనల్ రౌండ్ లో న్యాయ నిర్ణేతల ప్రశ్నకు ఇచ్చిన జవాబుతో ఈ టైటిల్ దక్కిందన్నారు. ఈ ఈవెంట్ కు 6 నెలల నుండి ఆడిషన్ జరిగాయన్నారు. MBA గ్రాడ్యుయేట్ అయిన తను human rights and social justice mission and women empowerment కి ఖమ్మం కార్యదర్శిగా వున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయున తను తన భర్త మరియు ఇతర కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఖమ్మంకు చెందిన తను ఈ విజయం సాధించడం చాలా గర్వంగా వుందన్నారు. మహిళల కోసం మహిళా హక్కుల కోసం ఏదైనా చేయాలనేదే తన ధ్యేయం అని సమాజ సేవలో తను ఎప్పుడూ ముందుంటానని ఈ సంధర్భంగా ఫర్హా అన్నారు.