మాట తప్పనన్న ముఖ్యమంత్రి …మమ్ముల్ని వెంటాడతావా ? సీఎం పై బండి సంజయ్ నిప్పులు…
-తెలంగాణ ప్రజలను వెంటాడి వేటాడటానికి గెలిపించారా?
-రైతులకోసం వెళ్ళాం …మాపై దాడులకు తెగబడతారా ?…బండి సంజయ్
-పోలిసుల సమక్షంలో దాడులు జరిగాయి.
-రైతుల చేతుల్లో రాళ్ళూ ,కోడి గుడ్లు ఉంటాయా ?
-ఆటోలలో కర్రలు ,రాడ్లు తెచ్చిందెవరు ?
-70 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు
-జర్నలిస్టులవల్ల మా కార్యకర్తలు రక్షించబడ్డారు . వారికీ హాట్సాప్
-కళ్లాల్లో ఉన్న ధాన్యం కొంటారా ? లేదా ?
-మా పర్యటనలు ఉండబట్టే కొద్దో గొప్పో ధాన్యం కొనుగోలు చేశారు
మాటతప్పానన్న ముఖ్యమంత్రి మమ్ములను వెంటాడతావా ? అందుకేనా తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది ? రైతుల సమస్యలు పరిష్కరించమంటే దాడులు చేయిస్తావా ? వడ్లు కొనమంటే రాడ్లతో కొట్టిస్తావా ? ఇదేనా నీ పరిపాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు .నిన్న ,మొన్న జరిగిన దాడులపై ఆయన మీడియా సమావేశంలో మండి పడ్డారు . ఉద్యోగాలు అడిగితె జైల్లో పెడతావా ? అందుకే ప్రజలు నీవంటే అసహ్యహించుకుంటున్నారు . గుర్తు పెట్టుకో 2023 ఎన్నికల్లో బీజేపీదే అధికారం . 3 సీట్ల నుంచి 88 రావడం ఖాయం . మేము వానాకాలం వడ్లు కొనమంటే కొనకుండా మా పై దాడులు చేస్తారా ? ఇది సీఎం ప్రోత్సవం తో జరిగిన దాడి. 70 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మా పై దాడి చేసి మమ్ములనే అరెస్ట్ చేయడం విచిత్రంగా ఉంది. ఇది ఎక్కడైనా ఉందా? అని సంజయ్ ప్రశ్నించారు. పోలిసుల సమక్షంలోనే ఆటోలలో కర్రలు ,రాడ్లు తెచ్చి దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవాదం మరి ఆశ్చర్యకరం.లోకల్ పోలీస్ టీఆర్ యస్ కార్యకర్తలకు సహాయపడుతుందని ఆరోపించారు. దీనిపై డీజీపీ కు ఫిర్యాదు చేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన స్పందించరు. జర్నలిస్టులవల్ల మా కార్యకర్తలు రక్షించబడ్డారు . వారికీ హాట్సాప్ వారిని నాజీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అన్నారు. వరిధాన్యం కల్లాల లో పెట్టుకొని ఉంటె వాటిని కొనే దిక్కు లేదు . ఆకాల వర్షాలకు తెచ్చిన ధాన్యం తడిసి పోతుంది. ఐకెపి కేంద్రాలలో రోజుల తరబడి ఉన్న దిక్కు మొక్కు లేదని రైతులు వాపోతున్నారని సంజయ్ విమర్శించారు . మేము పర్యటనలు బయలు దేరితే ఆదరాబాదరాగా కొంత ధాన్యం కొనుగోలు చేశారని అన్నారు. కేసీఆర్ తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.