Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణకు గతంలోనే చెప్పాం… బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

తెలంగాణకు గతంలోనే చెప్పాం… బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ
-ధాన్యం కొనుగోలు డిమాండ్ తో కేసీఆర్ మహాధర్నా
-దేశంలో వరిసాగు ఎక్కువైందన్న కేంద్రం
-ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని వెల్లడి
-పంట మార్పిడి అనివార్యమని స్పష్టీకరణ

ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మహాధర్నా చేపడుతున్న తరుణంలోనే, కేంద్రం తమ వైఖరిని స్పష్టం చేసింది. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని వెల్లడించింది. దేశంలో వరిసాగు ఎక్కువైందని, ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని వివరించింది.

దేశ అవసరాలకు మించి వరిసాగు చేపడుతున్నారని కేంద్రం పేర్కొంది. పంట మార్పిడి అనివార్యమని పునరుద్ఘాటించింది. వరిని తక్కువగానే పండించాలని తెలంగాణకు గతంలోనూ సూచించామని తెలిపింది. ఈ నేపథ్యంలో యాసంగి పంటను కూడా పరిమితంగానే కొంటామని స్పష్టం చేసింది. రబీలో ఎంత ధాన్యం కొనుగోలు చేసేది త్వరలో చెబుతామని వెల్లడించింది.

 

నా గెలుపుతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదు: ఈటల ఫైర్
సెంటిమెంటును వాడుకుని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది?
కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెపుతారు

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల సెంటిమెంటును వాడుకుని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. పథకాలు, డబ్బులతో పాటు పలు ప్రలోభాలకు కేసీఆర్ గురిచేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. తన గెలుపుతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో రూ. 600 కోట్లను ఖర్చుపెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని అన్నారు.

2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెపుతారని ఈటల జోస్యం చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెపుతున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటలను బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ‘నిధులు కేంద్రానివి, పథకాలపై ఫొటోలు మాత్రం కేసీఆర్ వి’ అంటూ ఆయన దుయ్యబట్టారు.

 

సీఎం కేసీఆర్ ఏ సబ్జెక్టుపై ధర్నా చేస్తున్నారు?: ఎమ్మెల్యే రాజాసింగ్
ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ మహాధర్నా
స్పందించిన రాజాసింగ్
హుజూరాబాద్ లో ఓటమితో కేసీఆర్ ఉలిక్కిపడ్డారని ఎద్దేవా
బీజేపీ ఎదుగుదలతో ఆందోళనకు గురవుతున్నారని విమర్శలు

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు దిగడం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హుజూరాబాద్ లో బీజేపీ దెబ్బకు కేసీఆర్ ఉలికిపాటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ ఏ సబ్జెక్టుపై ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీ ఎదుగుదల భయాందోళనలు రేకెత్తిస్తున్నందునే కేసీఆర్ ఇవాళ రోడ్డు మీదికి వచ్చారని విమర్శించారు. ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అంతా చూస్తున్నారని, ధాన్యం కొనుగోలు అంశంలో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో ప్రజలకు తెలుసని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

Related posts

ఆఫ్ఘాన్ జాతి నిర్మాణం మా లక్ష్యం కాదు.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా: జో బైడెన్!

Drukpadam

చంద్రబాబు ,అమిత్ షా ఫోన్ సంబాషణపై సజ్జల వ్యంగ్య బాణాలు!

Drukpadam

కవిత-రేవంత్ రెడ్డి మధ్య చీకటి వ్యాపారాలు, జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

Drukpadam

Leave a Comment