కమ్మ కోటాలో మధుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా అవకాశం!
-విద్యార్ధి దశనించే రాజకీయాలపై ఆశక్తి
-యస్ ఎఫ్ ఐ లో కీలక భాద్యతలు నిర్వహించిన మధు
-పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు
-గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన మధు
ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా పిండిప్రోలుకు చెందిన తాతా మధును సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు . గతంలో రెండు సార్లు పనిచేసిన బీసీ నేత బాలసాని లక్ష్మి నారాయణ కు ఈసారి ఆవకాశం దక్కలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను తరువాత తెలంగాణ శాసన మండలిలోనూ బాలసాని రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ గా పని చేశారు. ఈసారి కూడా గట్టి ప్రయత్నమే చేశారు.కానీ కమ్మ సామజిక వర్గ కోటాలో అనూహ్యంగా తాతా మధుకు ఆవకాశం లభించింది. కమ్మ కోటాలో చాలామంది ఉన్నప్పటికీ మధుకు వివాద రహితుడిగా పేరుంది . నిర్మాణం దక్షతగల మధు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు . టీఆర్ యస్ రాష్ట్ర కార్యదర్శిగా , గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు . పార్టీ అప్పగించిన పని చేయడం తో పార్టీ నాయకత్వానికి దగ్గరైయ్యారు . ఖమ్మం జిల్లాలో ఈసారికూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం వస్తుందని అనుకున్నారు. ప్రధానంగా గాయత్రీ రవి , ఆర్జేసీ కృష్ణ , పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన వంకలయాలపాటి రాజేంద్రప్రసాద్ ,తుమ్మల నాగేశ్వర్ రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారి పేర్లు వినిపించాయి. అయితే వారిని ఎవరిని కాదని తాతా మధు కు టికెట్ రావడం ఆశ్చర్యం కల్గించిన అనివార్యం అయింది. విద్యార్ధి దశనుంచే రాజకీయాలపై ఆశక్తి ఉన్న మధు రాజకీయప్రస్థానం సిపిఎం పార్టీ నుంచి ప్రారంభం అయింది. ఎస్ ఎఫ్ ఐ లో ఉస్మానియా విద్యార్ధి ఉద్యమంలో ప్రముఖుడిగా ఉన్నారు.
స్థానిక సంస్థల టీఆర్ యస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాతా మధు
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థలనుంచి టీఆర్ యస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధు నేడు ఖమ్మం కలక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్