కేంద్రంపై కేసీఆర్ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషం: భట్టి
–కేసీఆర్ పై భట్టి వ్యాఖ్యలు
–గతంలో యూటర్న్ తీసుకున్నాడని ఆరోపణ
–అమిత్ షాను కలవగానే నిర్ణయం మార్చుకున్నాడని వెల్లడి
–ఈసారి యూటర్న్ తీసుకోరాదని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్దానికి సిద్ధమైయ్యానని చెప్పరు …. అందుకు ఢిల్లీకి కూడా వెళ్లారు ….సంతోషం కానీ యుద్ధం చేయకుండా కేంద్రంలోని బీజేపీ తో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని తిరిగిరావడం అలవాటుగా మరీన విషయాన్నీ భట్టి గుర్తు చేశారు. కేంద్రపై యుద్దానికి సిద్ధమన్న మాటలలపై సీఎల్పీ నేత భట్టి ఘాటుగా స్పందించారు. నిజంగా కేసీఆర్ కు రైతుల పై ప్రేమ ఉంటె కేంద్రంలో బీజేపీని, తెలంగాణాలో పండించిన వడ్లను కొనటంలేదని చేస్తున్న ఆరోపణలపై నిలబడాలని అన్నారు. ఆలా కాకుండా మాటిమాటికి కేంద్రపై యుద్ధం అనడం ఆ తరువాత జారుకోవడమా ఆయన కు రివాజు గా మారిందని విమర్శించారు.
. కేంద్రంపై కేసీఆర్ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషం అంటూనే తనదైన శైలిలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్రంపై పోరులో గతంలో యూటర్న్ తీసుకున్న కేసీఆర్ మరోసారి అలా చేయరాదని అన్నారు. నాడు రైతుల చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి, ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు హస్తినపై యుద్ధమే అంటున్నారని, అమిత్ షాను కలుస్తానని అంటున్నారని వివరించారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరని, ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం చేస్తాడో లేదో తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి విక్రమార్క వ్యంగ్య బాణాలు వదిలారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంతాలకోసం యుద్ధాలకు పోతున్నట్లు నటించరాదని హితవు పలికారు. యుద్ధం చేస్తారో ఇంకేమి చేస్తారో కానీ రైతులు నష్టపోకుండా వడ్లను కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. లేదా ఢిల్లీలో ప్రధాని ఇంటిముందు ధర్నా చేయాలనీ అన్నారు. ఇప్పటీకే ఐకెపి కేంద్రాలకు తీసుకోని వచ్చిన వడ్లు తడిసి మొలకలు వస్తున్నా విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.