కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం
-కర్ర కోత మిల్లు లో దగ్దమైన కలప …25 ఆస్తి నష్టం
-ప్రమాద వశాత్తు జరిగిందేనని భావిస్తున్న అధికారులు
-తక్షణమే స్పందించిన స్థానిక కార్పొరేటర్ దొడ్డా నగేష్
ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర అయ్యప్ప స్వామి టెంపుల్ వెనుక భాగంలో గల ఒక ఫర్నిచర్ తయారు చేసే షాపులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రాంతంలోని ప్రాథమిక ప్రభుత్వ హాస్పిటల్ పక్కన తెల్లవారుజామున కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది . చుట్టుపక్కల స్థానికులు ఇచ్చిన సమాచారానికి వెంటనే 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డా నగేష్ స్పందించి వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ఫైర్ స్టేషన్ ఆఫీసుకు , త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు , ఎమ్మార్వో ఆఫీస్ కు సమాచారం తెలియజేశారు . ఫైర్ స్టేషన్ అధికారులు వెంటనే రెండు ఫైరింజన్లను పంపి సిబ్బందితో చెలరేగుతున్న మంటలను ఆర్పారని , అలాగే త్రీ టౌన్ సీఐ సర్వయ్య గారు ఇద్దరు కానిస్టేబుల్ లను పంపారని , ఎమ్మార్వో ఆఫీస్ నుండి వీఆర్వో మస్తాన్ వచ్చి వివరాలను తెలుసుకుని పోయారని అన్నారు . విధి వక్రీకరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగలేదని ఆస్తి నష్టం జరిగిందని సందర్భంగా స్థానిక కార్పోరేట్ పేర్కొన్నారు . శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సామిల్ దుగడ మిషన్ యజమాని వాసి రెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ 200 వంద ఫీట్ల టెకు కర్ర , డబుల్ కాట్ మంచాల బోర్డులు , డబుల్ కాట్ మంచాలు , తలుపులు , కిటికీలు , దుగడ మిషిన్లు తో పాటు రేకుల షెడ్డు కుడా కాలిపోయిందని , దీనిని నే నమ్ముకుని సుమారుగా పది కుటుంబాలు బతుకుతున్నాయని , గత ఇరవై సంవత్సరాల నుండి ఈ వృత్తిలో ఉన్నామని , ఈ ప్రమాదంలో సుమారుగా 25 లక్షలు విలువ గల ఆస్థి నష్టం జరిగిందని తెలియజేశారు . తక్షణమే ప్రభుత్వం , దుగడ మిషన్ యూనియన్ నాయకులు ఆదుకోవాలని కోరారు .