Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ పార్టీకి గట్టు గుడ్ బై!

టీఆర్ యస్ కు గట్టు గుడ్ బై: కేసీఆర్ కు రాజీనామా లేఖ!
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ గట్టు
పనిలో మిమ్ములను మెప్పించలేక పోయానని లేఖలో వివరణ
ఇంతకాలం ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపిన గట్టు

టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ . సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌‌కు పంపారు. ” మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యానని” లేఖలో గట్టు తెలిపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

గట్టు రాజీనామా టీఆర్ యస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది . ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం స్థానిక సంస్థల అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. టీవీ చర్చ కార్యక్రమాలలో పార్టీ వాయిస్ వినిపించడంలో దిట్టగా ఆయనకు పేరుంది. వైసీపీ లో ఉండగా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రతినిధిగా కేంద్రంతో చర్చలు జరిపిన టీం లో ఆయన ఉన్నారు .తనకు టీఆర్ యస్ లో ఎదో ఒక పదవి రాకపోతుందా అని అనుకున్నారు.ప్రత్యేకించి ఖమ్మం జిల్లా రాజకీయాలపై గట్టుకు ఆశక్తి ఉంది. దీంతో ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భావించారు. కానీ అవకాశం రాలేదు . వైయస్ఆర్ పార్టీలో ఆయన కు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు ఉంది. మరి ఇప్పుడు ఎటు అడుగులు వేస్తారో అనే సందేహాలు కలుగు తున్నాయి షర్మిల పార్టీలో చేరతారా ? లేక తిరితి కాంగ్రెస్ గూటికి చేరి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా ? అనేది చుడాలిసేందే మరి .

Related posts

వైసీపీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే పై వేటు …

Drukpadam

కేసీఆర్ తర్వాత నేనే.. ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

జూబ్లీహిల్స్ కేసును పక్కదార్లు పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది: రేణుకా చౌదరి!

Drukpadam

Leave a Comment