Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మధు ప్రచారంలో తుమ్మల …

మధు ప్రచారంలో తుమ్మల …
-ఎమ్మెల్సీ గా తాతా మధు గెలిస్తే …ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం :తుమ్మల
-పనిచేసే సత్తా ఉన్న నాయకుడు మధు
-అందరికి అందుబాటులో ఉంటాడు అన్న తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా అశ్వరావుపేట ఎన్నికల సన్నాహక సమవేశం శనివారం జరిగింది. ఇందులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. తన స్వగ్రామమైన గండుగులపల్లిలో ఉన్న తుమ్మలను స్థానిక సంస్థల నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాతా మధు , పట్టభద్రుల ఎమ్మెల్సీ ,రైతు బందు అధ్యక్షుడు ,పల్లా రాజేశ్వరరెడ్డి కలిశారు. అనంతరం అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా మధుకు అవకాశం దొరకడం సంతోషం అని అన్నారు. వచ్చిన అవకాశాన్ని మధు సద్వినియోగం చేసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా సీఎం కేసీఆర్ నిర్ణయించిన తాతా మధుకు ఓట్లు వేయడం ద్వారా అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని తుమ్మల కోరారు. అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు తోపాటు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న తాత మధుకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దొరకడం చాలా సంతోషించదగ్గ విషయం అని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా తాత మధు విజయం సాధిస్తే ప్రజాప్రతినిధుల గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు . ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ సమయ అనుకూలంగా పనిచేసే ఎమ్మెల్సీ గా ప్రజాప్రతినిధులకు ఆదరాభిమానాలు చూరగొంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు . కార్యక్రమం లో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజు కూడా పాల్గొన్నారు.

Related posts

విడుదలయ్యే సినిమాలన్నీ మీపైనే ఆధారపడి ఉన్నాయి!: ఏపీ సీఎం జగన్ కు అల్లు అరవింద్ విజ్ఞప్తి!

Drukpadam

చెన్నై కి నీరు సరఫరా విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం…..

Drukpadam

జగన్ గ్రాఫ్ పడిపోలేదు …ఆ సర్వే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ది: పేర్ని నాని

Drukpadam

Leave a Comment