Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య త్వరలో కొత్త పార్టీ!

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య త్వరలో కొత్త పార్టీ!
-బీసీల కోసం త్వరలోనే రాజకీయ పార్టీ..అని ప్రకటన
-అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆనందయ్య
-పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శ
-బీసీ జేఏసీని కలుపుకుని కొత్త పార్టీ పెడతామని వెల్లడి
-ప్రభుత్వం అనుమతిస్తే మూడో దశకు మందు పంపిణీ

ఆనందయ్య ఆయర్వేద వైద్యుడు ….కరోనా కు నాటుమందు పంపిణి చేయటం ద్వారా తెలుగు రాష్ట్రాలలో మారుమోగిన పేరు … ప్రపంచంలోనే ఆనందయ్య మందుపై చర్చ జరిగింది. ఇప్పడు ఆయన రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో ఉన్నారు. అందుకు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు . రాజకీయాల్లో బీసీలకు ఆదరణ లేదని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బీసీలకు ఎదో ఒకటి చేయాలనే తపనతో పార్టీ పెట్టాలని భావిస్తున్నారు. సోమవారం రోజున విశాఖపట్నం పర్యటించన ఆయన అనకాపల్లి లో ఉన్న నూకాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు . ఈ సందర్భంగా ఆయన తన రాజకీయపార్టీ ఆలోచనను వెల్లడించారు. అన్ని రాజకీయపార్టీలలో బీసీలకు ఆధారణలేదని అందువల్లనే బీసీల కోసమే తాను రాజకీయపార్టీ పెడుతున్నట్లు చెప్పారు .

కరోనా వైరస్‌కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కూడా అయిన ఆనందయ్య నిన్న విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం కనుక సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు.బీసీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. బీసీ సంఘానికి ఆనందయ్య గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పటికే బీసీలలో అనేక కులాలు తన ఆలోచనలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. చూద్దాం ఆనందయ్య కొత్త బీసీ పార్టీ ఎలా ఉంటుందో …..

Related posts

Drukpadam

గుజరాత్ ఓట్లతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా!

Drukpadam

నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాయి విసిరిన వ్యక్తి… చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు!

Drukpadam

Leave a Comment