Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు నిరసన సెగ!

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు నిరసన సెగ!
-వరద పరిహారంపై భాదితుల ఆందోళన
-వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల..
-పరిహారం ఏమూలకు సరిపోదన్న బాధితులు
-మంపు ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల
-వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల ఆవేదన
-ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదన్న బాధితులు
-ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని సజ్జల హామీ

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భారీ వర్షాల కారణంగా ఇటీవల అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయనకు నిరసన వ్యక్తమైంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఒక ఏడాదిలో నమోదు కావాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతోనే జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఇళ్లను పూర్తిగా కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తామని సజ్జల హామీ ఇచ్చారు. ఏపీ లో భారీ వర్షాలకు భారీ నష్టం జరిగింది. వరద ప్రాంతాలను సీఎం జగన్ పర్యటించకపోవడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ ఇంటినుంచి బయటకు వెళ్లారని ఆరోపించారు. దీంతో సీఎం జగన్ ప్రతినిధిగా సజ్జల వర్షాల కారణంగా బాగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. భాదితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన భాదితుల నుంచి నిరసన సెగ తగలటం తో ఇప్పటి వరకు భాదితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయి అర్థం అవుతుంది. సజ్జలకు నిరసన సెగ తగలడంతో ఎలాంటి సహాయం అందిస్తారో చూడాలి మరి !

Related posts

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు …

Drukpadam

టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు!

Drukpadam

డెల్టాక్రాన్ తో ప్రమాదం ఎక్కువే.. నిపుణుల హెచ్చరిక!

Drukpadam

Leave a Comment