Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఎంసీ ఎంపీ భుజం తట్టిన రాజ్‌నాథ్ సింగ్..

టీఎంసీ ఎంపీ భుజం తట్టిన రాజ్‌నాథ్ సింగ్..
-పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతుండగా ఘటన
-వెనక నుంచి వచ్చి రెండు చేతులతో ఎంపీ భుజాలు తట్టిన రాజ్‌నాథ్
-వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయిన సుదీప్
-మాట్లాడుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి

ప్రతిపక్షాలు పాలకపక్షాలు మధ్య విమర్శలు ప్రతివిమర్శలు సహజం అంతమాత్రాన శత్రువైఖరితో ఉండటం సహజం …అదే సందర్భంలో కలిసినప్పుడు పలకరించుకోవడం కుశల ప్రశ్నలు వేసుకోవడం జరుగుతుంది. దాన్నే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అదే జరిగింది. పార్లమెంట్ ప్రాంగణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మీడియా తో మాట్లుడుతున్నాడు , అదికూడా పాలక పక్షమైన బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు . అటువైపు నుంచి వస్తున్నా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సుదీప్ బందోపాధ్యాయ వెనకకుండా వచ్చి సరదాగా ఆయన భుజాలపై చేతులు వేశాడు . ఇది చుసిన మిగతా సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే అది ప్రెస్ మీట్ అవడంతో కానివ్వండి కానివ్వండి అంటూ రాజ్ నాథ్ అక్కడ నుంచి వెళ్లి పోయారు. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న సుదీప్ బందోపాధ్యాయ నవ్వుతూనే మీడియా సమావేశాన్ని కొనసాగించారు .

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు తట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెనక నుంచి భుజాలు తట్టిన రాజ్‌నాథ్ ముందుకు రావడం, వెనకవైపు చూసిన బందోపాధ్యాయ ఆశ్చర్యపోవడం వీడియోలో కనిపిస్తోంది. నిన్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వద్ద సుదీప్ మీడియాతో మాట్లాడుతున్నారు. పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.

అదే సమయంలో అటువైపుగా వచ్చిన రాజ్‌నాథ్ సుదీప్ భుజాలపై తన రెండు చేతులతో తట్టారు. వెనక్కి తిరిగి చూసిన సుదీప్ ఎవరూ లేకపోవడంతో ముందుకు చూశారు. రాజ్‌నాథ్ కనిపించడంతో ఆ పని ఆయనే చేసి ఉంటారని భావించి చిరునవ్వులు చిందించారు. స్పందించిన రాజ్‌నాథ్ ‘మాట్లాడండి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

నల్లారి, సినీ నటుడు మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తున్నారా …?

Drukpadam

జగన్, మీరు తోడుదొంగలై రాజధానిని ఇట్టా చేశారు: సోము వీర్రాజును నిలదీసిన అమరావతి వృద్ధ రైతు!

Drukpadam

జనం కరోనా తో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రాజకీయక్రీడ ఆడుతున్నారు… సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment