Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వరిధాన్యం పై పార్లమెంట్ లో టీఆర్ యస్ ఎంపీల ఆందోళన దద్దరిల్లిన సభ!

వరిధాన్యం పై పార్లమెంట్ లో టీఆర్ యస్ ఎంపీల ఆందోళన దద్దరిల్లిన సభ!
లోకసభ లో రెండవ రోజు వరిధాన్యం కొనుగోళ్లపై టీఆర్ యస్ పట్టు … సభ వాయిదా
అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?అని నిలదీసిన టీఆర్ యస్ సభ్యులు
తెలంగాణ రైతుల వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్
స్పీక‌ర్ పోడియం ఎదుట‌ … టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌…సభను వాయిదా వేసిన స్పీకర్
కేంద్ర అలసత్వంపై టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం లోకసభకు తాకింది.టీఆర్ యస్ సభ్యులు కేంద్రం వైఖరిపై చర్చకు పట్టు పట్టారు …వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ దాన్ని తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన టీఆర్ సభ్యులు లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వరంలో స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. వారిని ఆందోళన విరమించాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పయికి సభ్యులు వినకపోవడంతో చేసింది లేక సభను వాయిదా వేశారు. అంతకుముందు నిబంధనల ప్రకారం చర్చకు టీఆర్ యస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. టీఆర్ యస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు రైతు సమస్యలపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు . ఇది అత్యంత అవసరమైనదని సభకు తెలిపారు. రైతుల సమస్యలను పట్టించుకోవాలని తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ లో ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండిస్తూ లోక్ సభలో ఆందోళన దిగారు .

 

స్పీక‌ర్ పోడియం ఎదుట‌ … టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌.. లోక్‌స‌భ వాయిదా

ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని … వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని నిలదీశారు . వరి కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలని… ప్లకార్డులు పట్టుకొని టీఆర్ యస్ ఎంపీలు నినాదాలు చేశారు . సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. .ఆకుప‌చ్చ కండువాలు ధ‌రించిన టీ.ఆర్.యెస్ ఎంపీలు.. వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని పట్టు భట్టారు.

ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టీ.ఆర్.యెస్ స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

పట్టు వీడని టీఆర్ఎస్…లోక్ సభ మరోమారు వాయిదా

టీఆర్ఎస్ ఎంపీల నిరసన తో లోక్ సభ మరో మారు వాయిదా పడింది రైతు సమస్యలపై చర్చకు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎంపీ లు చర్చకు పట్టుబట్టి స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తిరిగి సభలో అదే సీన్ రిపీట్ కావడంతో సభను రేపటికి వాయిదా వేశారు .

లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఫైర్

 

తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్లలో  కేంద్ర ప్రభుత్వం తీరుతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని ,కేంద్రం రైతులపట్ల వ్యవహరిస్తున్న తీరు నష్టం కలిగించేలా ఉందని లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు .  60 రోజులుగా రైతుల ధాన్యం సేకరణ చేయాలని కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లేఖ రాసినా పట్టించుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం స్పందన సరిగా లేనందునే పార్లమెంట్ వేదికగా నిరసన తెలుపుతున్నాం.
ప్రభుత్వం ప్రకటన స్పష్టమైన చేస్తే చర్చలకు సిద్ధంమని నామా వెల్లడించారు . ఇందుకు  ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్నారు  కేంద్ర ప్రభుత్వం ఇక్కడో రకంగా.. తెలంగాణలో ఇంకో రకంగా చెబుతుందని దుయ్యబట్టారు . ధాన్యం కొనుగోళ్లలో ద్వంద నీతి అవలంభిస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని స్పీకర్ ద్వారా కేంద్రాన్ని కోరుతున్నాం తెలిపారు .

 

Related posts

ప్రతిపక్షాల పాట్నా భేటీపై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు…

Drukpadam

ఏపీ రాజకీయాల్లోకి రేణుక చౌదరి ..ఖమ్మం కు బై బై చెపుతారా …?

Drukpadam

తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదు …డీకే శివకుమార్

Drukpadam

Leave a Comment