Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మే.. కానీ..!: బైడెన్

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మే.. కానీ..!: బైడెన్
-ఒమిక్రాన్ గురించి ఆందోళ‌న అవ‌స‌రం లేదు
-అయినా లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు
-అమెరికాలో ఓ వ్య‌క్తిలో ఒమిక్రాన్ నిర్ధార‌ణ

క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ గురించి ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ కేసులు ఉన్న ఇతర దేశాల నుంచి విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించాయి. అయితే, ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పారు. అమెరికాలో ఓ వ్య‌క్తిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధార‌ణ అయింది.

అయితే, ఆ వేరియంట్ ప్ర‌మాద‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అమెరికాలో లాక్‌డౌన్ అవ‌స‌రం లేద‌ని బైడెన్ చెప్పారు. ప్ర‌జ‌లు అంద‌రూ క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే, క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తే లాక్‌డౌన్ అవ‌స‌రం ఉండ‌బోద‌ని వైట్‌హౌస్‌లో మీడియాకు తెలిపారు. కాగా, ఎనిమిది ఆఫ్రికా దేశాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌పై అమెరికా ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించింది.

దక్షిణాఆఫ్రికా కు ఇప్పటికే 20 కి పైగా దేశాలు విమానప్రయాణాలను నిలిపివేశాయి. ప్రపంచం అంతా ఆందోళన చెందుతున్నది . వివిధ దేశాలు కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి.

Related posts

సీఎం జగన్ వ్యాఖ్యలపై జేఎంఎం ఆగ్రహం…

Drukpadam

కొవిడ్‌ సంరక్షణా కేంద్రానికి అమితాబ్‌ రూ.2 కోట్ల విరాళం…

Drukpadam

పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త మీదే: మంత్రి హ‌రీశ్ రావు!

Drukpadam

Leave a Comment