Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంట్ లో  నాలుగోవరోజు  టీఆర్ యస్ రచ్చ రచ్చ…

పార్లమెంట్ లో  నాలుగోవరోజు  టీఆర్ యస్ రచ్చ రచ్చ…
-గాంధీ విగ్రహం ముందు బైఠాయింపు
-తెలంగాణ కు న్యాయం చేయాలనీ డిమాండ్
-రైతులు పండించిన ధాన్యం కొనాల్సిందేనని ప్లే కార్డు ల ప్రదర్శన
-కేంద్ర విధానాలపై నిప్పులు చెరిగిన నామా ,కేకే

టీఆర్ యస్ పార్లమెంట్ సభ్యులు వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై హస్తినలో తమ పోరాటాన్ని నాలుగోవరోజు కొనసాగించారు. ఉభయసభల్లో రచ్చ రచ్చ చేశారు. కేంద్ర విధానాలపై దుమ్మెత్తి పోశారు. రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభంకాగానే లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు , రాజ్యసభలో టీఆర్ యస్ నేత కేకే లు వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చర్యలను తూర్పారబట్టారు.

 

 

టీ.ఆర్.ఎస్ పార్లమెంట్ పార్టీ నేత కే. కేశవరావు… లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు టీ.ఆర్.ఎస్ ఎంపీ ల బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్లే కార్డు లు ధరించి నినదించారు. మిగతా పార్టీలు ఏవి మద్దతు ఇవ్వనప్పటికీ టీ.ఆర్.ఎస్ ఎంపీల ఒంటరి పోరాటం కొనసాగించి తెలంగాణకు జరుగుతున్నా అన్యాయాన్ని దేశం దృష్టికి తేగలిగారు . నిన్న సభలో చివరికి బాయిల్డ్ కూడా కొంత కొనుగోలు చేస్తామని చెప్పక తప్పలేదు . అయినప్పటికీ దానిపై స్పష్టం లేకపోవడంతో స్పష్టత కావాలని పట్టు బట్టారు. ప్రొక్యూర్మెంట్ పాలసీ పైన క్లారిటీ ఏది ? అని ప్రశ్నించారు . ధాన్యం సేకరణ పై కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన మొండి వైఖరి వీడి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. ధాన్యం సేకరణకు జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు . ధాన్యాన్ని సేక‌రించాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వానిదేనని అయినప్పటికీ దానినుంచి తప్పుకోవాలని చూడటంపై మండిపడ్డారు. రైతులు.. కేంద్రం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారని పేర్కొన్నారు. లోక్ సభ లో టి.ఆర్.ఎస్ ఎంపీ ల ఆందోళన తో కార్యకలాపాలు స్తంభించాయి. లోక్ సభలో టీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వర రావు ఆధ్వర్యంలో రైతుల కోసం పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టారు .

ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్ నాయకత్వంలో గత ఏడూ సంత్సరాలుగా చేపట్టిన చర్యలవల్ల పంటల ఉత్పత్తి పెరిగి రైతులు తమ ధాన్యం మార్కెట్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతుండటాన్ని సభ దృష్టికి తెచ్చారు. సీఎం కేసీఆర్ రైతు బందు , ఉచిత విద్యుత్ , నీటి సదుపాయం కల్పించినందున వివిధ రకాల పంటలు ముఖ్యంగా వరిధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిన విషయాన్నీ వివరించారు. వారిదిగుబడుల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది అని దాన్ని కొనకపోతే రైతులు నష్టపోతారని సీఎం కేసీఆర్ లేఖ రాసినప్పటికీ కేంద్రం తగినచర్యలు తీసుకోలేదని అన్నారు. గత మూడు రోజులుగా ఆందోళన జరుపుతున్న పట్టించుకోకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు.

Related posts

ఏమాత్రం తగ్గని డ్రాగన్… భారత సరిహద్దుల్లో మరో గ్రామం నిర్మాణం!

Drukpadam

విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చండి… బడ్జెట్ ముంగిట ప్రధాని మోదీకి కేటీఆర్ విజ్ఞప్తి!

Drukpadam

సాగర్ లో పోటీకి విజయశాంతి సై అంటారా ?

Drukpadam

Leave a Comment