ఆంధ్రప్రదేశ్

ఆకాశంలో మిస్టరీ కాంతులు… పంజాబ్ లో అంతుచిక్కని ఘటన…

ఆకాశంలో మిస్టరీ కాంతులుపంజాబ్ లో అంతుచిక్కన ఘటన

  • పఠాన్ కోట్ వద్ద ఆకాశంలో కనిపించిన లైట్లు
  • వరుసలో ఉన్న లైట్లు
  • దాదాపు 5 నిమిషాల పాటు దర్శనం
  • మిస్టరీగా మారిన వైనం

పంజాబ్ లో అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది. పఠాన్ కోట్ లో ఈ సాయంత్రం చీకట్లు కమ్మే సమయంలో ఆకాశంలో వింత కాంతులు దర్శనమిచ్చాయి. ఆ లైట్లు ఏమిటో అర్థం కాక ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. ఆకాశంలో ఓ వరుసలో కనిపించిన లైట్లు ఏమిటో అటు అధికారులకు కూడా అంతుబట్టలేదు. సాయంత్రం 6.50 నిమిషాలకు ఈ లైట్లు కనిపించాయి. దాదాపు 5 నిమిషాల పాటు కనిపించాయని స్థానికులు వెల్లడించారు.

ఇదే తరహాలో ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లోని జునాగఢ్ లోనూ వినువీధిలో మిస్టరీ లైట్లు కనిపించాయి. అవి గ్రహాంతరజీవుల వాహనాలుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారు నరోత్తమ్ సాహూ ఆ ప్రచారంపై స్పందిస్తూ… కొన్ని ఉపగ్రహాలు అత్యంత తక్కువ ఎత్తులో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు ఆ విధంగా కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తాజాగా, పంజాబ్ లోని పఠాన్ కోట్ లో కనిపించిన లైట్ల అంశం మాత్రం మిస్టరీగా మారింది.

Related posts

హైదరాబాదులో బొత్స కుమారుడు సందీప్ నిశ్చితార్థం… తరలి వచ్చిన నేతలు, టాలీవుడ్ తారలు!

Drukpadam

ఖమ్మం నగర మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక దృశ్యాలు

Drukpadam

రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాని మోదీ పై ఉగ్రదాడులు ముప్పు .. నిఘా వర్గాలు హెచ్చరిక!

Drukpadam