Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోశయ్య ను హింసించారు … వీహెచ్ హాట్ కామెంట్స్!

రోశయ్య ను హింసించారు … వీహెచ్ హాట్ కామెంట్స్!
సీఎం బాధ్యతలను ప్రశాంతంగా నిర్వర్తించకుండా రోశయ్యను హింసించారు
ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదనే బాధ రోశయ్యలో ఉండేది
అందరూ రోశయ్యను ఉపయోగించుకున్నారు
రోశయ్య మృతి కాంగ్రెస్ కు తీరని లోటు

రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు …ఆయన అనేక పదవులు అనుభవించారు. ఎప్పడు కూడా విర్రవీగలేదు ….అనుకువగా ఉన్నారు…. ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ వారితో సర్దుకొని పోవడం ఆయన ప్రత్యేకత ….వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆయన్ను హాయిగా కమాండ్ ముఖ్యమంత్రి ని చేస్తే ఆ భాద్యతలను ప్రశాంతంగా చేయనివ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హాట్ కామెంట్స్ చేశారు. అందువల్లనే సోనియా దగ్గరకు వెళ్లి అమ్మ నాకు ఈ పదవి వద్దని చెప్పారని వీహెచ్ సంచలన విషయాలు బయటపెట్టారు.

ఉమ్మడి ఏపీ మాజీ మఖ్యమంత్రి రోశయ్య మృతి అందరినీ కలచి వేస్తోంది. రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రోశయ్య సేవలను, ఆయనతో వారికున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ, రోశయ్య మృతి ఎంతో బాధను కలిస్తోందని అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. రోశయ్య మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా హింసించారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదనే బాధ రోశయ్యలో ఉండేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోశయ్యను ఉపయోగించుకున్నారని అన్నారు.

Related posts

ఆయన రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈయనకు ఎందుకు మంట!

Drukpadam

అత్యధిక ప్రజామోదం ఉన్న నేతగా ప్రధాని మోదీ.. ప్రపంచ లీడర్లలో నంబర్ 1 

Drukpadam

గులాబీ బాస్ మీటింగ్ … ఏమి చెబుతారోననే ఉత్కంఠ !

Drukpadam

Leave a Comment