Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాద్ధాంతం తగదు …వర్షకాలం పంట పూర్తిగా కేంద్రం కొంటుంది …కేంద్ర మంత్రి గోయల్!

రాద్ధాంతం తగదు …వర్షకాలం పంట పూర్తిగా కేంద్రం కొంటుంది …కేంద్ర మంత్రి గోయల్!
-ఎం ఓ యూ కు విరుద్ధంగా రాష్ట్రం వితండ వాదం చేస్తుంది.
-ధాన్యం సేకరణలో కర్ణాటక విధానం బాగుంది
-తెలంగాణ నుంచి 24 లక్షల బాయిల్డ్ కు ఒప్పందం కుదిరింది…దాన్ని 44 లక్షలకు పెంచాం
-ఇప్పటికే 27 లక్షలు సేకరించాం …ఇంకా 17 లక్షలు సేకరించాల్సి ఉంది
-ఇక బాయిల్డ్ రైస్ పంప బోమని రాష్ట్రం చెప్పింది అందుకు లేక ఇచ్చింది

వానాకాలం పంట పూర్తిగా కొంటామని దానికి రాద్ధాంతం తగదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు . దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామని.. తెలంగాణ నుంచి కూడా బాగా పెంచామని వివరించారు. 2018-19లో తెలంగాణలో 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5లక్షల టన్నులు, 2020-21లో 94.5లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లో 50లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 32.66 లక్షల టన్నులే ఇచ్చింది. ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోంది. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బావుంది. దాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బావుంటుంది. తెలంగాణ నుంచి 24లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు ఒప్పందం జరిగింది. దాన్ని 44లక్షల టన్నులకు పెంచాం. ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ వచ్చింది.. ఇంకా 17లక్షల టన్నులు పెండింగ్‌ ఉంది. పెండింగ్‌ ధాన్యం పంపకుండా భవిష్యత్‌ గురించి టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని ముందుగానే చెప్పాం. ఈ విషయాన్ని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నాం. అయినా భవిష్యత్‌ గురించి ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోంది. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ పంపబోమని అక్టోబర్‌ 4న తెలంగాణ లేఖ రాసింది. ఇప్పుడు మాత్రం బాయిల్డ్‌ రైస్‌ కొనాలని పదేపదే గొడవ చేస్తున్నారు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భౌతిక తనిఖీల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వెళ్లారు. ఆ రాష్ట్రం ధాన్యం లెక్కలను సరిగా నిర్వహించడం లేదు. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదు. ఏళ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతన్న ప్రక్రియే. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోంది.’’ అని పీయూష్‌ గోయల్‌ అన్నారు..

Related posts

12 Holistic Nutrition Tips to Get Beautiful Skin This Season

Drukpadam

కరోనాతో చనిపోతామనే భయం ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వలేము: సుప్రీంకోర్టు

Drukpadam

లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం!

Drukpadam

Leave a Comment