Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హెల్త్‌హబ్‌గా వరంగల్ …తెలంగాణ సర్కార్ నిర్ణయం…

హెల్త్‌హబ్‌గా వరంగల్ …తెలంగాణ సర్కార్ నిర్ణయం…
వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.1,100కోట్లు…
15 ఎకరాలు 23 అంతస్తులతో ఆసుపత్రి నిర్మాణం
అత్యవసర కేసులకు హెలిపాడ్ సౌకర్యం
2 వేల పడకల సామర్థ్యం …36 విభాగాలు

వరంగల్‌లో నిర్మించనున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2వేల పడకలతో నిర్మించనున్న దవాఖానకు రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రిజ్వీ పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో సివిల్ వర్క్స్కు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. టీఎస్‌ఎంఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆదేశించారు.

వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఆవరణలో జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 15 ఎకరాల్లో 24 అంతస్థుల్లో భారీ ఆసుప్రతి నిర్మాణం జరుగనున్నది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు.

2వేల పడకల సామర్థ్యంతో నిర్మించనున్న దవాఖానలో 36 విభాగాలు పని చేస్తాయని ఇంతకు ముందే వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది పని చేయనున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయై అందుబాటులోకి వస్తే.. నిరుపేదలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హైదరాబాద్‌ బాట పట్టే కష్టాలకు తెరపడనున్నది.

Related posts

అసైన్డ్ లాండ్స్ పై రైతులకు పూర్తి హక్కులు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

Drukpadam

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 23 సీట్లే: విష్ణుకుమార్ రాజు

Ram Narayana

ఏపీలో మరోసారి భూకంపం.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు!

Ram Narayana

Leave a Comment