Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎనర్జీ స్టోరేజ్ హబ్’కు అధిక ప్రాధాన్యత..మంత్రి పువ్వాడ…

ఎనర్జీ స్టోరేజ్ హబ్’కు అధిక ప్రాధాన్యత..
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు.
గోవాలో రౌండ్ టేబుల్ సమావేశం
సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం.

ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు .

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై రాష్ట్రంలో లలిత్ గోల్ఫ్ అండ్ స్పారిస్టార్ , కెనకోనాలో జరిగిన అత్యున్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో మన రాష్ట్రం నుంచి ఆయన పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు , పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం , పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై చర్చించారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో మంత్రి వివరించారు.

ఢిల్లీ, గుజరాత్ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ పాలసీని ప్రారంభించిన మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అనేక రాయితీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వినియోగానికి ప్రోత్సహాకాలు అందిస్తోందని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో వంద శాతం మినహాయింపు అందిస్తున్నట్లు వివరించారు.

అలాగే, 20 వేల ఆటోలు, 10 వేల లైట్ గూడ్స్ వెహికల్స్ , 5 వేల ఎలక్ట్రిక్ కార్లు, మొదటి 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను , రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు.

తాజా విధానాలకు అనుగుణంగా ఇ.వి , ఇ.ఎన్.ఎన్ ( ఎలక్ట్రిక్ వేహికల్ , శక్తి నిల్వ ) వ్యవస్థ రంగాలకు తెలంగాణను ప్రధాన స్థావరంగా మార్చడం , యు.ఎస్.డి 4.0 బిలియన్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం , షేర్ మొబిలిటీ , ఛార్జీంగ్ , మానవ వనరుల అభివృద్ధి , ఇ.వి , ఇ.ఎస్.ఎస్ తయారీ కార్యకలాపాలలో ఇ . విల ద్వారా 2030 నాటికి లక్షా 20 వేల మందికి ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీ వాహనాలను కొనుగోలు చేసేందుకు పలువురు మొగ్గు చూపుతున్నారని, దీంతో హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోతున్నాయని చెప్పారు.

నగరంలో 2016లో కేవలం 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా , ఇప్పుడు వాటి సంఖ్య 10 వేలకు పైగా పెరిగాయని వెల్లడించారు.

ప్రతి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్కు భద్రతా ఉపకరణాలు, తగిన పౌర సేవలు, కేబులింగ్, ఎలక్ట్రిక్ వర్కులతో సహా అన్ని సంబంధిత సబ్ స్టేషన్ పరికరాలతో కూడిన ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ అవసరం అవుతుందని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఛార్జర్లను కలిగి ఉండాల్సి ఉందన్నారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం అత్యంత సమగ్రమైన విధానాన్ని తీసుకొచ్చిందని, పటిష్టమైన ఆలోచనలతో ఈ పాలసీని రూపొందించే సమయంలో ఆచరణాత్మక విధానాన్ని అనుసరించామని తెలిపారు.

 

ఒలెక్ట్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభోత్సవం..

 

 

విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి, మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవా రాష్ట్రంలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే..

ఎలక్ట్రిక్ వాహనాల(EV) ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణపై రూపొందించాల్సిన విధివిధానాలపై గోవా రాష్ట్రంలోని లాలిట్ గోల్ఫ్ & స్పా రిసార్ట్, కెనకోనాలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరైయ్యారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు వాహనాల తయారీ పై వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్ ను 300 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లో ఏర్పాటు చేయనున్న విషయం విదితమే.

ఈ ప్లాంట్ ను అతి తక్కువ మానవ ప్రమేయం, పూర్తిస్థాయి ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నారు.

బస్సులు తో పాటు త్రివీలర్స్, ట్రక్కులు, ఇతర వాహనాలు కూడా తయారు చేయనున్నారు.

 

Related posts

ఇక షావోమీ చౌక కార్లు..! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు…

Drukpadam

‘జగన్ బెయిల్ ర‌ద్దు’ పిటిష‌న్‌పై విచార‌ణ‌:.. రిజాయిండ‌ర్ దాఖ‌లు చేసిన ర‌ఘురామ‌..

Drukpadam

కూలిన మంగళగిరి దేవస్థానం ప్రహరీ.. 200 ఏళ్ల చరిత్ర!

Drukpadam

Leave a Comment