Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికుడు చనిపోవడంతో ఢిల్లీ తిరిగొచ్చిన అమెరికా వెళ్లే విమానం!

ప్రయాణికుడు చనిపోవడంతో ఢిల్లీ తిరిగొచ్చిన అమెరికా వెళ్లే విమానం!
ఢిల్లీ నుంచి నెవార్క్ కు వెళుతున్న ఎయిరిండియా విమానం
గాల్లో ఉండగానే ప్రయాణికుడికి అస్వస్థత
టేకాఫ్ తీసుకున్న 3 గంటల తర్వాత ఢిల్లీకి తిరిగిరాక
ప్రయాణికుడిని పరీక్షించిన వైద్యులు
అప్పటికే మరణించినట్టు నిర్ధారణ

విమాన ప్రయాణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకోవడంతో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ నుంచి 3 గంటలు ప్రయాణం చేసిన విమానం తిరిగి ఢిల్లీ చేరుకుంది. విషయమేమిటంటే ప్రయాణికుల్లో ఒకరు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో విమానసిబ్బంది ఆయన ప్రయాణాన్ని కాపాడేందుకు తిరిగి విమానాన్ని డిల్లీకి తీసుకోని వచ్చారు. అయినప్పటికీ అప్పటికే అతను చనిపోయాడు . అతన్ని అమెరికా జాతీయుడు . దీంతో విమానంలో విషాదం నెలకొన్నది .

ఎయిరిండియా విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మార్గమధ్యంలో మరణించాడు. అతడిని అమెరికా జాతీయుడిగా గుర్తించారు. అతడు తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అయితే విమానం గాల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

దాంతో, టేకాఫ్ తీసుకున్న మూడు గంటల తర్వాత ఆ విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానంలోకి ప్రవేశించిన ఎయిర్ పోర్టు వైద్య సిబ్బంది ఆ ప్రయాణికుడిని పరీక్షించి, అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు పోలీసులకు నివేదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తదుపరి కార్యాచరణకు ఉపక్రమించారు.

Related posts

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Drukpadam

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది పర్యాటకుల మృతి..

Drukpadam

వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి.డిప్యూటీ గా రిజ్వానా

Drukpadam

Leave a Comment