Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ముంబయి టెస్టు: ముగిసిన మూడో రోజు ఆట…విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్!

  • ముంబయి టెస్టు: ముగిసిన మూడో రోజు ఆట…విజయానికి 5 వికెట్ల దూరంలో
    భారత్
    గెలుపు ముంగిట కోహ్లీ సేన
    కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్l.ujh
    ప్రస్తుతం 5 వికెట్లకు 140 రన్స్ చేసిన కివీస్
    ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉన్న వైనం

ముంబయి టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన కోహ్లీ సేన… విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండగా, డ్రా కోసం ఆడడం కివీస్ శక్తికి మించిన పని అని చెప్పాలి.

ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 60 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 6, ఓపెనర్ విల్ యంగ్ 20, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 6 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ బ్లండెల్ (0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, కివీస్ 62 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Related posts

ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న హైద్రాబాద్ యువతి ఇషా సింగ్ ..

Ram Narayana

పాక్ కు సెకండ్ షాక్.. సింగిల్ రన్ తో గెలిచిన జింబాబ్వే!

Drukpadam

ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి… విజయవంతంగా మూడవసారి !

Drukpadam

Leave a Comment