Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో రసమయి మాటల కలకలం

టీఆర్ యస్ లో రసమయి మాటల కలకం
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాటలు టీఆర్ యస్ లో కలకలం  రేపుతున్నాయి.తెలంగాణ ఉద్యమం లో ముఖ్యనేత రాష్ట్రo మొత్తం తెలిసిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు .ఉద్యమకారుల అందరితోనూ సంభందాలు ఉన్నవాడు. ఆయన మాటలను అందరు జాగ్రత్తగా వింటారు. ఆలోచిస్తారు . అందువల్లనే కళాకారుడిగా, ఎమ్మెల్యేగా ఆయనకు మంచి పేరుంది.కానీ ఆయన ఒక కారక్రమం లో పాల్గొని చెప్పిన మాటలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి . ప్రతిపక్షాల విమర్శలు వేరు సొంత పార్టీ వాళ్ళ జాగ్రత్తగా ఉండకపోతే వారిమాటలే ప్రతిపక్షాలకు వజ్రాయుధాలుగా మారతాయి. ఆకోవలోకే వస్తాయి రసమయి మాటలనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
అందరు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నాడని అనుకుంటున్నారు. రేపో మాపో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని వార్తలు వస్తున్నా నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల స్వరాలు అధికార టీఆర్ యస్ కు ఇబ్బంది కరంగా మారుతున్నాయి ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు . కొందరు మంత్రులు , ఎమ్మెల్యేలు ఇప్పటికే కేటీఆర్ ను కలిసి అభినందనలు తెలియజేస్తుండగా మరికొందరు స్వరాలూ మారడం పై రరకాల అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ నడిబొడ్డున ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉద్యమాన్ని ఉరకలు పెట్టించి, రాష్ట్రంలో ఉద్యమానికి ఊపిరులు ఊదిన తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ ఎమ్మెల్యేగా అంత సంతృప్తిగా లేనట్లు ఉన్నాడనేది ఆయన మాటలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. కొద్దీ రోజుల క్రితం ఈటల రాజేందర్ ఇదే తరహాగా కాకతాళీయంగానో ,కావాలనో తన మనసులోని భావాలను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో వ్యక్తీకరించాడు. టీఆర్ యస్ పార్టీ ఏఒక్కరి సొంతం కాదని అందరి కష్టం అందులో ఉందని అన్నారు . ఒక వ్యక్తి పై ఆధారపడే పార్టీ కాదని అన్నారు. పార్టీ ఎవరు జాగీరు కాదని ,ప్రతి వ్యక్తి, నా పార్టీ ,నా జెండా అనకపోతే పార్టీ నిలవదని అన్నారు. పార్టీ ఎవరి పెట్టారు , జెండా ఎవరు తెచ్చారు , అనేది కాకుండా పార్టీ నిలవాలంటే సమిష్టిగా పనిచేయాలని అన్నారు. పార్టీలు , నేతలు చరిత్ర నిర్మాతలు కారాని ప్రజలే చరిత్ర నిర్మాతలని అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు ఆనందం భాద రెండు ఉంటాయని కూడా ఆయన అన్న మాటలు పార్టీలో తర్జన భర్జనలు దారీతీశాయి . ఇదే తరహాలో ఆదివారం మహబూబాబాద్ లో జయరాజు తల్లి సంతాపసభలో పాల్గొన్న రసమయి మాటలు టీఆర్ యస్ లోని అసంతృప్తిని బయట పెడుతున్నాయని అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి.తెలంగా రాష్ట్ర సాధన కోసం ఊరూరా తిరిగి తన ఆటపాటలతో ప్రజలను చెతన్యపరిచి ఉద్యమం లోకి యువకులను ,కవులను , కళాకారులను ఆకర్షించిన రసమయి నిర్వేదం లో ఉన్నారు. ఎమ్మెల్యే అయినా దగ్గరనుంచి మానసికంగా, బౌతికంగా ప్రజలకు దూరంగా ఉన్నాననే భాదతో ఆయన ఉన్నారని ఆయన మాటలే చెబుతున్నాయి. సమాజంలో కవులు ,కళాకారులూ మౌనంగా ఉండటం కాన్సర్ కన్నా ప్రమాదకరమన్నారు.అధికార పార్టీ శాసన సభ్యుడుగా ఉండటంతోనే తన సహజత్వాన్ని కోల్పోయానని వాపోతున్నారు. ప్రస్తుతం తానొక లిమిటెడ్ కంపెనీ లో పనిసస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రసమయి మాటలు టీఆర్ యస్ పార్టీలో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Related posts

పొంగులేటి నిర్ణయం ఆలశ్యం సరే …ఆమోదయోగ్యంగా ఉంటుందా….?

Drukpadam

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

Drukpadam

ఉద్ధవ్ థాకరే భార్యపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. మండిపడ్డ ముంబై మేయర్!

Drukpadam

Leave a Comment