Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్న ‘మెట్రో మ్యాన్’

Metroman Sridharan shows interest on CM post

సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్న ‘మెట్రో మ్యాన్’
మెట్రోమ్యాన్ గా గుర్తింపు పొందిన శ్రీధరన్
బీజేపీలో చేరేందుకు సన్నాహాలు
పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని వెల్లడి
గవర్నర్ పదవిపై ఆసక్తి లేదన్న శ్రీధరన్
ఆ పదవితో రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యలు
భారత దేశంలో మెట్రో రైల్ వ్యవస్థాపకుడు శ్రీధరన్ కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక కలిగింది. అందుకు ఆయన బీజేపీ ni ఎంచుకున్నాడు.అందులో చేరి తనస్వంత రాష్ట్రమైన కేరళకు ముఖ్యమంత్రి కావాలని ఉబలాట పడుతున్నాడు. అందుకు ఆయన మనసులో మాటను దాచుకోకుండా చెప్పాడు కూడా . తనకు రాజకీయాలంటే ఆసక్తి ఉందని అందుకు తాను బీజేపీలో చేరాలని భావిస్తున్నానని వెల్లడించారు. వృద్ధాప్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసుతున్నారు విశ్లేషకులు . ఆయన ఎంచుకున్న పార్టీలో కురువృద్దులకు చోటు ఉండదన్న విషయాన్నీ ఆయన మరిచినట్లు ఉన్నారు.
భారత్ లో ప్రజారవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేలా మెట్రో రైలు వ్యవస్థలకు ఊపిరిపోసిన ప్రముఖ ఇంజినీర్, శ్రీధరన్ మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి పొందారు. ప్రస్తుతం ఆయన గాలి రాజకీయాలపై పడింది. ఇంజినీర్ గా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను దేశానికి అందించిన ఆయన రాజకీయాల్లో చేరి సొంతరాష్ట్రం కేరళకు ఏదైనా చేయాలని పరితపిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న శ్రీధరన్ సీఎం పదవిపై ఆయన అమితమైన ఆశక్తిని కనబరుస్తున్నారు.

కేరళలో బీజేపీని అందలం ఎక్కించడమే పరమావధిగా శ్రమిస్తానని, ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు కూడా తాను సిద్ధమేనని తన మనోగతం వెల్లడించారు. ఒకవేళ తాను కేరళ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గవర్నర్ పదవిపై తనకు ఏమంత ఆశ లేదని, ఆ పదవితో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం ఏమంత ఉండదని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, తాను బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నాడో కూడా శ్రీధరన్ వివరణ ఇచ్చారు. కేరళను ఎల్డీఎఫ్ (సీపీఎం), యూడీఎఫ్ (కాంగ్రెస్) ఎన్నో ఏళ్లుగా పాలిస్తున్నాయని, కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ఈ రెండు పార్టీలు కేరళను అభివృద్ధి చేయలేకపోయాయని, అందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. కేరళలో బీజేపీకి పెద్దగా బలంలేదు.ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు శ్రమిస్తానని అంటున్నారు. కేరళలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. వృద్ధ ఇంజనీర్ కల నెరవేరుతుందోలేదో చూడాలి …

Related posts

బెంగాల్‌ స్కూల్‌కూ పాకిన హిజాబ్ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఎగ్జామ్స్ రద్దు!

Drukpadam

వంద రూపాయల నోట్ పై ఎన్టీఆర్ బొమ్మకు ప్రయత్నాలు …పురందరేశ్వరి

Drukpadam

రాజకీయాలపై జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment