Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యుద్ధానికి నేను సిద్ధం…!మాజీ ఎంపీ పొంగులేటి

రాబోవు కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం..!
-ప్రజలు కోరుకున్నది చేసి చూపిస్తా…
-వారి దీవెనలే నా ఎదుగుదలకు మూలకారణం
-జగనన్న ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చా
-రైట్ ఛాయిస్ అకాడమీ సెమినార్ లో మాజీ ఎంపీ పొంగులేటి

 యావత్తు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో… కోరుకునేదాన్ని… తప్పకుండా రాబోయే రాజకీయాల్లో… రాబోయే చదరంగంలో…రాబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా చేసి చూపిస్తానని… కురుక్షేత్ర యుద్ధానికి మీ శీనన్న సిద్ధంగా ఉన్నాడని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ల్లో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు రెండువేల మంది నిరుద్యోగులతో ఆదివారం ఏర్పాటు చేసిన సెమినార్కు పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే….

కల్లూరు మండలం నారాయణపురం అనే చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన నేను చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ.. దినదినాభివృద్ధి జరిగి భగవంతుడి దయతో ఆర్థికంగా నిలదొక్కుకున్నా… ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 23వ తేదీన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి రావడం జరిగింది… రాజకీయాల్లోకి వచ్చిన 13 నెలల ఆనతి కాలంలోనే ప్రజల ఆశీస్సులు… దీవెనలతో ఎంపీగా గెలిచాను… నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ద్వారా వారికి చేయాల్సింది చేశాను… ప్రభుత్వం ద్వారా కానీ వాటిని వ్యక్తిగతంగా చేసి చూపాను… గడిచిన నాలుగు సంవత్సరాలుగా నాకు ఎటువంటి పదవులు లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ వారికి తోడు నీడగా… అండగా ఉంటూ కష్టం వస్తే మీ శీనన్న ఉన్నాడనే నమ్మకాన్ని… భరోసా కల్పించాను. ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ గడప తటినా శీనన్న మాయాన్న… శీనన్న ఈ ఇంటి బిడ్డ… మా ఇంటి బిడ్డ అనే వారు లక్షలాది మంది ఉన్నారు. వారి ఆశీస్సులతో రాబోవు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను.

-విద్యతోనే ఏదైనా సాధ్యం…
ఈ ప్రపంచంలో దేనైనా సాధించగల ఒకే ఒక్క ఆయుధం విద్య మాత్రమే… అలాంటి విద్యలో రాణించి… మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి… మన తల్లిదండ్రులు పడిన కష్టనష్టాలు మనం మన పిల్లలు పడకూడదనే ఆలోచనతో ముందకు సాగాలి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోనే కాదు… రాష్ట్ర స్థాయిలోనే రైట్ ఛాయిస్ అకాడమీ నిరుద్యోగుల బెస్ట్ ఛాయిస్ గా ఎదిగిందంటే ఆ ఘనత అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ కు దక్కుతుంది… ఆయనకున్న నిబద్ధత… క్రమశిక్షణ దీనికి ప్రధాన కారణం… అలాంటి నిబద్ధత… క్రమశిక్షణను మీరు కూడా పాటిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిరుద్యోగులను ఉద్దేశించి పొంగులేటి ప్రసంగించారు.

Related posts

చైనాలో సైనిక తిరుగుబాటు…కొట్టి పారేసిన వైనం.. జిన్‌పింగ్ క్వారంటైన్‌లో ఉన్నారంటున్న నిపుణులు

Drukpadam

రాష్ట్రపతి ప్రసంగం -బాయ్ కాట్ కు 16 రాజకీయ పార్టీల నిర్ణయం

Drukpadam

“మా” గొడవలకు శుభం కార్డు పడుతుందా ?లేదా ??

Drukpadam

Leave a Comment