Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. పార్లమెంటు సమావేశాల బహిష్కరణ!

టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. పార్లమెంటు సమావేశాల బహిష్కరణ!
-ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రంపై యుద్ధం చేస్తున్న టీఆర్ఎస్
-కేంద్రం నుంచి కానరాని ప్రతిస్పందన
-పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేసిన టీఆర్ఎస్

-రైతులకు న్యాయం జరగడం లేదనే పార్లమెంటు సమావేశాలను -బహిష్కరించాం: టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు
-కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం మండిపాటు
-ధాన్యం కొనుగోళ్లపై నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శ

 

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే, వీరి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ, చట్టసభలను బాయ్ కాట్ చేయడం బాధాకరమైన విషయమేనని… అయితే, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బాయ్ కాట్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు.

9 మంది లోక్ సభ, 7 గురు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై గత ఏడు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని… కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెపుతోందని… రబీ సీజన్ లో ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని, వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుందని, అందుకే రబీలో పండే ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా మారుస్తామని కేకే చెప్పారు. బాయిల్డ్ రైస్ ను కొంటారో, లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వడం లేదని… డొంక తిరుగుడు సమాధానాలను చెపుతోందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం జరగడం లేదనే కారణంతోనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించకుండా బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Related posts

సోనియా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు ..

Drukpadam

అఖిలేష్ జిన్నాపై వ్యాఖ్యలు ఎస్పీ ,బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగం:మాయావతి

Drukpadam

హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే ప్ర‌తిపాద‌న ఉంది: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

Drukpadam

Leave a Comment