Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన మాట ప్రకారం ‘పెద్దమ్మాకు సెల్ ఫోన్ పంపిన సీఎం జగన్!

ఇచ్చిన మాట ప్రకారం ‘పెద్దమ్మాకు సెల్ ఫోన్ పంపిన సీఎం జగన్!
-బిత్తర పోయిన పెద్దమ్మ …సీఎం పంపిన విషయం చెప్పిన అధికారులు
-‘పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది’ అని మాట నిల‌బెట్టుకున్న సీఎం జ‌గ‌న్
-ఇటీవ‌ల చిత్తూరు జిల్లాలో జగన్‌తో సెల్ఫీ
-ఆ క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్న ఓ మహిళ
-ఈ చిన్న విష‌యాన్నీ మ‌ర్చిపోని జ‌గ‌న్
-గుర్తుపెట్టుకొని సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదంటూ మ‌హిళ‌ హ‌ర్షం
-దటీస్ జగన్ అంటున్న అభిమానులు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే పేరుంది కానీ చిత్తూరు జిల్లాలోని వరద భాదితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక పెద్దావిడ తన సెల్ ఫోన్ కాలువలో పాడేసుకుంది. దీన్ని గమనించిన జగన్ పెద్దమ్మ నీ సెల్ ఫోన్ ఇప్పించే భాద్యత నాది అని హామీ ఇచ్చారు. హామీమేరకు కొద్దీ రోజుల తరువాత ఆ పెద్దమ్మ ఇంటికి రాష్ట్రప్రభుత్వ అధికారులు వచ్చి కొత్త సెల్ ఫోన్ ఇచ్చారు. దీంతో పెద్దమ్మ అనే విజయ సీఎం అన్నమాట తాను మరిచిపోయానని ,అయినప్పటికీ గుర్తుపెట్టుకొని తనకు సెల్ ఫోన్ పంపించినందుకు సంతోషం వ్యక్తం చేసింది.

ఇటీవ‌ల చిత్తూరు జిల్లాలో జగన్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్న ఓ మహిళ తాజాగా ఓ కొత్త సెల్‌ఫోన్‌ అందుకుని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే వరద బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు జగన్‌తో సెల్ఫీ దిగేందుకు ముందుకు దూసుకువచ్చారు.

ఆ స‌మ‌యంలో విజయ అనే మ‌హిళ‌ సెల్‌ఫోన్‌ జారి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన జగన్‌ ‘పెద్దమ్మా, మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది. బాధపడవద్దు’ అని హామీ ఇచ్చారు. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను కూడా విజ‌య మ‌ర్చిపోయింది. అయితే, సీఎం ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష కొత్త సెల్‌ఫోన్‌ను డాక్టర్‌ రవికాంత్‌ ద్వారా విజ‌య‌కు అందజేశారు.

దీంతో విజ‌య స్పందిస్తూ… త‌న‌ను ఓదార్చడానికి జగన్ బాబు అలా చెప్పారనుకున్నాన‌ని వ్యాఖ్యానించింది. నిజంగానే ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఆ మ‌హిళకు జ‌గ‌న్ సెల్‌ఫోన్ కొనిచ్చిన ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Related posts

టీచ‌ర్ల ఆస్తుల వెల్ల‌డిపై వెన‌క‌డుగు వేసిన తెలంగాణ స‌ర్కారు!

Drukpadam

విజయవాడ లయోలా కళాశాల వద్ద వాకర్స్ నిరసన ..

Ram Narayana

మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా: చంద్రబాబు శపథం

Drukpadam

Leave a Comment