కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు వేద విద్యార్థుల మృతి
- గుంటూరు జిల్లాలో విషాదం
- మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన వేద విద్యార్థులు
- నీట మునిగి మరణం
- మృతులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కు చెందినవారు
గుంటూరు జిల్లాలో మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు వేద విద్యార్థులు మరణించారు. వీరంతా మాదిపాడు వద్ద ఉన్న శ్వేత శృంగాచలం వేద పాఠశాల విద్యార్థులు. మృతి చెందినవారిని శివ శర్మ, హర్షిత్ శుక్లా, నితేశ్ కుమార్ దీక్షిత్, అన్షుమన్ శుక్లా, శుభం త్రివేదిగా గుర్తించారు. మరో విద్యార్థి వివరాలు తెలియరాలేదు. వీరు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.
ఇంకా కొందరు నీటమునిగి ఉంటారన్న అనుమానంతో గజ ఈతగాళ్లు కృష్ణా నదిలో గాలిస్తున్నారు. నదిలో సుడిగుండాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈతకు దిగడం వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.