Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సర్వదర్శనాల కోటా పెంపు: పలు కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ బోర్డు!

సర్వదర్శనాల కోటా పెంపు: పలు కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ బోర్డు!

  • ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
  • అన్నమయ్య నడకమార్గం అభివృద్ధికి నిర్ణయం
  • శ్రీశైల ఆలయ గోపురానికి బంగారు తాపడం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్టు ఈరోజు సమావేశమై కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీ తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
  • సంక్రాంతి తర్వాత సర్వదర్శనం టోకెన్ల పెంపు
  • ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
  • భక్తుల సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గం అభివృద్ధికి నిర్ణయం
  • వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు వద్ద కొట్టుకుపోయిన ఆలయాల పునర్నిర్మాణం
  • ఐటీ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు ఉద్యోగ నియమాకాలు
  • రూ. 2.6 కోట్లతో నూతన పరకామణి మండపంలో యంత్రాల కొనుగోలు
  • హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం
  • నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపదికన మండప నిర్మాణం
  • శ్రీశైల ఆలయ గోపురానికి బంగారు తాపడం
  • రూ. 10 కోట్లతో స్విమ్స్ లో హాస్టల్ భవనాల నిర్మాణం
  • కల్యాణకట్టలో క్షురకులకు ఇచ్చే పీస్ రేటు రూ. 11 నుంచి రూ. 15కి పెంపు
  • రూ. 3 కోట్ల వ్యయంతో వసతి గదుల్లో గీజర్ల ఏర్పాటు
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పించాలని నిర్ణయం.

Related posts

మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేశ్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు

Ram Narayana

సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై గవర్నర్‌గా ఉండకూడదు: హరీశ్ రావు

Ram Narayana

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు షాక్.. లా ట్రిబ్యునల్ కోర్టులో చుక్కెదురు !

Drukpadam

Leave a Comment