Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇంకా ఆసుప‌త్రిలోనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ.. నేడు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా?

ఇంకా ఆసుప‌త్రిలోనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ.. నేడు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా?
-ఇటీవ‌ల ఆయ‌న ఇంట్లో సోదాలు
-నేడు విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు
-వైద్యులు డిశ్చార్జ్‌ చేస్తే సీఐడీ ఆఫీసుకు ల‌క్ష్మీనారాయ‌ణ‌
-హైకోర్టులో ఇప్ప‌టికే ముందస్తూ బెయిల్ పిటిష‌న్

చంద్రబాబు నాయుడి వ‌ద్ద గ‌తంలో ఆయ‌న ఓఎస్డీగా పనిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ అధికారులు ఇటీవ‌ల‌ సోదాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. చంద్రబాబు నాయుడి హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ ఈ సోదాలు జ‌రిగాయి. అనంత‌రం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నేడు ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే, అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10వ తేదీన సీఐడీ సోదాల నేప‌థ్యంలో ఇంట్లో స్పృహ తప్పి పడిపోయాడు.

అధిక రక్తపోటు కార‌ణంగా ఆయ‌న‌కు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించిన త‌ర్వాత ఆయ‌న విచార‌ణ‌కు వెళ్లే అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఆయ‌న‌కు వైద్యులు డిశ్చార్జ్‌ చేస్తే ఆయన మంగళగిరిలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో ల‌క్ష్మీనారాయ‌ణ‌ లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచార‌ణకు హైకోర్టు అనుమతించింది. ఈ రోజు మధ్యాహ్నం ఆ పిటిష‌న్‌ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related posts

బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఏటీఎంలలో నగదు లేకుంటే జరిమానా!

Drukpadam

What’s On The Horizon For Men’s Fashion This Fall

Drukpadam

అల్లర్లలో పాల్గొంటే సైన్యంలో ఉద్యోగం రాదు: వాయుసేనాధిపతి!

Drukpadam

Leave a Comment