నిమ్స్ ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు:మంత్రి హరీష్ రావు
-12 కోట్లతో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ప్రారంభం.
-45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్, కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం
-ఆయా విభాగాలకు 153 కోట్లతో అత్యాధునిక ఎక్విప్మెంట్ మంజూరు.
-త్వరలో రోబోటిక్ సర్జరీ సేవలు
-మాతా శిశువుల కోసం నిమ్స్ అటాచ్డ్ గా 200 పడకల ఆస్పత్రి మంజూరు
నిమ్స్ లో 12 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎక్విప్మెంట్స్ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాబోయే రోజుల్లో 153 కోట్లతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నిమ్స్ రాష్ట్రలో కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యరోగులకు అందిస్తుందని అన్నారు. మరో నెల పదిహేను రోజుల్లో 200 ఐ సి యూ బెడ్స్ , 120 వేటిలేటర్స్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో రోబోటిక్ సర్జరీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు . మాట శిశువుల కోసం 200 పథకాలతో నిమ్స్ అటాచ్డ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎం అర్ యు ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం వాటర్ ఏటిఎంల ప్రారంభం
12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
అందులో ముఖ్యంగా మెడికల్ జెనటిక్ ల్యాబరెటరీ అందుబాటులోకి వచ్చింది. వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను సవరించే అత్యాధునిక లాబ్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. మల్టీ డిసిప్లనరీ రిసెర్చ్ యూనిట్ నిమ్స్ లో అందుబాటులోకి తెచ్చాం మని మంత్రి అన్నారు .
బోన్ డెన్సిటీవ్ మీటర్ ను అందుబాటులోకి తెచ్చాం. బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదు. బోన్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది